రామ్ తో ఇది నాకు మూడో సినిమా.. ట్విస్ట్ ఇచ్చిన శ్రీలీల?
పాన్ ఇండియా రేంజ్ లో రూపొందించబడిన ఈ సినిమా సెప్టెంబర్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని చెప్పాలి. తెలుగుతో పాటు తమిళ్ కన్నడ మలయాళ హిందీ భాషల్లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. అయితే ఇటీవల విడుదలైన ట్రైలర్ ఒక రేంజ్ లో ఆ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని చెప్పాలి. ఈ ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది అని చెప్పాలి. ఇక ఇటీవల ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరగగా స్పెషల్ గెస్ట్ గా బాలయ్య వచ్చి సందడి చేశారు. అయితే రామ్ పోతినేనితో శ్రీ లీలకు ఇది మొదటి సినిమా అని చెప్పాలి.
కాగా సినిమాలో రామ్ కు ఎక్కడ తగ్గకుండా.. ఎనర్జీ డ్రాప్ అవ్వకుండా శ్రీ లీల అదిరిపోయే డాన్సులు చేసింది. అయితే ఇటీవల ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో శ్రీ లీల ఎవరికి తెలియని ఒక సీక్రెట్ ని బయటపెట్టింది. అయితే రామ్, శ్రీ లీల జంటకు ఇది తొలి సినిమా అని అందరూ అనుకున్నారు కానీ శ్రీలీలా మాత్రం తనకు రామ్ తో ఇది మూడో సినిమా అంటూ చెప్పి ట్విస్ట్ ఇచ్చింది. ఇంతకు ముందుకు రామ్ హీరోగా తెరకెక్కిన రెండు సినిమాల్లో శ్రీ లీలకు అవకాశం వచ్చిందట. కానీ ఏవేవో కారణాలవల్ల వాటిలో నటించలేక పోయిందట. చివరికి మూడో అవకాశంలో మాత్రం మా ఇద్దరికి కాంబో సెట్ అయిందని మూడు నా లక్కీ నెంబర్ అంటూ చెప్పింది శ్రీలీల.