తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న వారిలో తరుణ్ ఒకరు. ఈయన తన కెరీర్ లో ఇప్పటికే ఎన్నో సినిమాలలో హీరోగా నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే తరుణ్ కెరియర్ లో అద్భుతమైన విజయం సాధించిన మూవీ లలో నువ్వే కావాలి సినిమా ఒకటి. ఈ సినిమాకు విజయ భాస్కర్ దర్శకత్వం వహించగా ... త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీ కి కథను అందించాడు. ఈ మూవీ లో తరుణ్ సరసన రీచా హీరోయిన్ గా నటించింది. 2000 వ సంవత్సరంలో విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకొని ఆ సమయంలో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇకపోతే ఆ సమయంలో అద్భుతమైన విజయం అందుకున్న ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు.
తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువబడింది. ఈ మూవీ.ని మరికొన్ని రోజుల్లోనే థియేటర్ లలో 4 కే వర్షన్ తో థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. మరి ఆ సమయంలో అద్భుతమైన స్థాయిలో కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసిన ఈ సినిమా రీ రిలీజ్ లో భాగంగా ఎలాంటి కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తుం దో చూడాలి . ఇక పోతే ఈ సినిమాకి కోటి సంగీతం అందించాడు . ఈయన అందించిన సంగీతం కూడా ఈ సినిమా విజయం లో అత్యంత కీలక పాత్రను పోషించింది. ఈ మూవీ ని ఉషా కిరణ్ మూవీస్ పై రామోజీ రావు , స్రవంతి రవి కిషోర్ నిర్మించారు .