అసలు ఈ 2023 సంవత్సరం సెకండాఫ్ మెగా హీరోలకు కలిసిరాలేదా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం చాలా గట్టిగా వినిపిస్తోంది. ఈ సంవత్సరం పవన్, సాయితేజ్ కాంబినేషన్ లో తెరకెక్కి థియేటర్లలో విడుదలైన బ్రో సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడంలో చాలా దారుణంగా ఫెయిల్ కావడం గమనార్హం.బ్రో మూవీ ఫుల్ రన్ కలెక్షన్లు కేవలం 60 కోట్ల రూపాయలు మాత్రమే కావడంతో నిర్మాతలకు భారీ నష్టాలు మిగిలాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఇక భోళా శంకర్ సినిమాకు రిలీజ్ రోజునే దారుణమైన నెగిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమా ఫుల్ రన్ లో 30 కోట్ల రూపాయల కలెక్షన్లను కూడా సాధించలేదు. మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ లో భోళా శంకర్ సినిమా చాలా భారీ నష్టాలను మిగిల్చిన సినిమాలలో ఒకటి కావడం గమనార్హం. కేవలం 30% మాత్రమే ఈ మూవీ కలెక్ట్ చేసింది. ఇక తాజాగా విడుదలైన వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున సినిమా కూడా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోలేక అట్టర్ ప్లాప్ అయ్యింది.
ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలకు చాలా పెద్ద షాకిచ్చింది.ప్రవీణ్ సత్తారు గత సినిమా ది ఘోస్ట్ కూడా ఆశించిన రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకునే విషయంలో ప్లాప్ అయిందనే సంగతి తెలిసిందే. ప్రవీణ్ సత్తారు భారీ బడ్జెట్లతో సినిమాలను తెరకెక్కిస్తుండగా మెజారిటీ సినిమాలు ఆశించిన ఫలితాలను అందుకోక ప్లాప్ అవుతున్నాయి.భారీ ప్రాజెక్ట్ ల విషయంలో ప్రవీణ్ సత్తారు ఖచ్చితంగా జాగ్రత్త వహించాల్సి ఉంది. సాక్షివైద్య ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ఆమెకు ఈ సినిమాతో రెండోసారి కూడా భారీ షాక్ తగిలింది. తెలుగులో వరుసగా సినిమాలలో నటిస్తున్నా తన నటనతో ప్రేక్షకులను మెప్పించే విషయంలో సాక్షి వైద్య దారుణంగా ఫెయిలవుతున్నారు. గాండీవధారి అర్జున టైటిల్ పవర్ ఫుల్ గా ఉన్నా సినిమాలో ఆ పవర్ లేదని కామెంట్లు ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి.