జై భీమ్ కి ఆ విషయంలో అన్యాయం జరిగిందా....??

murali krishna
సూర్య ప్రధాన పాత్ర లో నటించిన జై భీమ్‌ సినిమా కు జాతీయ అవార్డు రాకపోవడం పట్ల పలువురు పలువురు పలు రకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు.ఒక స్మగ్లర్ పాత్ర పోషించిన అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు వచ్చింది. ఆ సినిమాకు పలు అవార్డులు ఇచ్చారు. కానీ జై భీమ్‌ సినిమా ఒక అద్భుతం. ఎన్నో గొప్ప కథ లను చూపించే ప్రయత్నం చేశారు.అలాంటి జై భీమ్ సినిమా కు కనీసం ఒక్క అవార్డు రాకపోవడం నిజంగా విడ్డూరంగా అనిపించింది. అయితే జై భీమ్ కు జాతీయ అవార్డు రాకపోవడం పట్ల అన్యాయం జరిగిందని కొందరు కామెంట్స్ చేయడం కరెక్ట్‌ గానే ఉంది.

కానీ పుష్ప సినిమా కు అవార్డులు ఇవ్వడం కరెక్ట్‌ కాదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో జై భీమ్‌ కు మద్దతుగా నిలుస్తున్న వారు పుష్ప ను విమర్శించడం కరెక్ట్‌ కాదు. ఉత్తమ నటుడు అవార్డు ను సూర్య కు ఇవ్వాల్సిన అవసరం లేదు.కానీ ఉత్తమ సినిమా లేదా స్క్రీన్ ప్లే, కథ వంటి వాటికి అవార్డు ఇచ్చి ఉండవచ్చు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి జై భీమ్‌ సినిమా విషయం లో అన్యాయం జరిగిందని కొందరు తెగ హడావిడి చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు సూర్య కానీ ఇతర జై భీమ్ యూనిట్‌ సభ్యులు కాని స్పందించారు.

జై భీమ్ సినిమా ను థియేటర్ రిలీజ్ చేయక పోవడం వల్ల జాతీయ అవార్డు రాలేదా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏంటి అనేది క్లారిటీ రావాల్సి ఉంది. సూర్య హీరో గా గతంలో వచ్చిన ఆకాశమే నీ హద్దు సినిమాకు మంచి స్పందన రావడం తో పాటు అవార్డులు కూడా వచ్చాయి. కనుక ఈ సినిమా విషయంలో అన్యాయం జరిగిందని అనుకోవడానికి ఏమీ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: