వికే నరేష్ ఒక దుర్మార్గుడు.. శివాజీ రాజా షాకింగ్ కామెంట్స్?

praveen
శివాజీ రాజా గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. కొన్ని సినిమాల్లో హీరోగా కూడా కనిపించాడు. అంతే కాదు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు శివాజీ రాజా. శివాజీ రాజా మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వికే నరేష్ జనరల్ సెక్రెటరీగా ఉన్నారు అని చెప్పాలి.

 శివాజీ రాజా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వీకే నరేష్ జనరల్ సెక్రటరీ అంటే వీరి మధ్య మంచి స్నేహబంధం ఉంది అని అర్థం చేసుకోవచ్చు. అయితే ఇటీవల శివాజీ రాజా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని వీకే నరేష్ గురించి సంచలన కామెంట్లు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రస్తుతం శివాజీ రాజా చేసిన కామెంట్లు కాస్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. ఏకంగా నరేష్ పెద్ద దుర్మార్గుడు.. ఆయన ఎక్కడ అడుగుపెడితే అక్కడ మొత్తం నాశనమే. ఆయన నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే మాట్లాడుతాడు. ఓ రోజు నేను అధ్యక్షుడిగా ఉన్న టైం లో ఓసారి అనుకోకుండా చిరంజీవి నాగార్జున గారు వస్తే నేను శ్రీకాంత్ వారిని ఆహ్వానించడానికి వెళ్ళాము.

 ఆ టైంలో నా గురించి శ్రీకాంత్ గురించి మా చాంబర్ లో టీవీలో ఒక ఫేక్ సీన్ క్రియేట్ చేసి చూపించడం అందులో నేను శ్రీకాంత్ కలిసి విజయనిర్మల, కృష్ణ వస్తున్న లిఫ్టును ఆపేసామని ఒక అబద్ధపు వార్త సృష్టించాడు నరేష్. ఈ విషయాన్ని నేను శ్రీకాంత్ చాలా ఘాటుగానే ఖండించాము. అప్పటికి నరేష్ ఆ విషయంలో అసలు భయపడలేదు. ఇద్దరికీ క్షమాపణలు చెబితేనే క్షమించి వదిలేస్తామని చెప్పాము అంటూ శివాజీ రాజా సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే గత కొంతకాలం నుంచి పవిత్ర లోకేష్ తో ఉన్న ప్రేమ వ్యవహారం కారణంగా వీకే నరేష్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోతున్నాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: