‘లెజెండ్’ వినయం.. స్టేజ్‌పై ఆమెకు నమస్కారం చేసిన బాలయ్య!

Amruth kumar
నందమూరి బాలకృష్ణ అంటే కేవలం బాక్సాఫీస్ దగ్గర తొడగొట్టి రికార్డులు తిరగరాయడమే కాదు.. అంతకు మించిన క్రమశిక్షణ, సంస్కారం ఆయన సొంతం. వెండితెరపై పవర్‌ఫుల్ డైలాగులతో విలన్ల గుండెల్లో వణుకు పుట్టించే బాలయ్య, నిజ జీవితంలో మాత్రం పెద్దల పట్ల ఎంతో వినయంగా ఉంటారు. తాజాగా ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (IFFD) లో బాలయ్య చేసిన ఒక పని ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.



ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలకృష్ణకు ప్రతిష్టాత్మకమైన ‘లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్’ అవార్డు లభించింది. ఈ వేడుకకు హాజరైన బాలయ్య, అక్కడ ఉన్న లెజెండరీ నటి హేమమాలినిని చూడగానే ఏమాత్రం సంకోచించకుండా ఆమె పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.ఒక స్టార్ హీరో అయి ఉండి, వందలాది మంది ప్రముఖుల ముందు ఒక పెద్ద ఆవిడకు ఆయన ఇచ్చిన గౌరవం చూసి బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ముగ్ధులయ్యారు.బాలయ్య వందో చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో ఆయన తల్లి పాత్రలో హేమమాలిని నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయం నుండి వీరిద్దరి మధ్య ఒక గొప్ప అనుబంధం ఉంది. ఢిల్లీ వేదికపై ఆ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ బాలయ్య చేసిన ఈ పని ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.


సినిమాల్లో ఎంత ‘మాస్’ హీరోగా కనిపించినా, నిజ జీవితంలో మాత్రం పద్ధతిగా ఉండటం నందమూరి వంశం గొప్పతనమని అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు.తన కంటే వయసులో, అనుభవంలో పెద్దవారైన వారిని గౌరవించడంలో బాలయ్య ఎప్పుడూ ముందుంటారు. హేమమాలిని కూడా ఎంతో ఆత్మీయంగా బాలయ్య తల నిమిరి దీవించడం అక్కడున్న వారిని ఆకట్టుకుంది. ప్రస్తుతం బాలయ్య తన తదుపరి సినిమాలతో బిజీగా ఉన్నా, ఇలాంటి అంతర్జాతీయ వేదికలపై ఆయనకు దక్కుతున్న గౌరవం తెలుగు సినిమా ఖ్యాతిని పెంచుతోంది.బాలయ్య తన హుందాతనంతో ఢిల్లీలో తెలుగు వారి జెండా ఎగురవేశారు.బాలయ్య ‘సంస్కారం’ వీడియో ఇప్పుడు టాప్ ట్రెండింగ్‌లో ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: