మెగా ఫ్యామిలీ బాండింగ్‌ను చెప్పిన అన్నా.. ఫ్యాన్స్ ఫిదా!
మెగాస్టార్ చిరంజీవి, నాగబాబులతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ అన్నా కొణిదెల రాసిన మాటలు ప్రతి మెగా ఫ్యాన్ కి ‘పూనకాలు’ తెప్పిస్తున్నాయి."15 ఏళ్ల క్రితం ఈ పెద్ద కుటుంబంలోకి వచ్చినప్పుడు ఎవరిని ఏమని పిలవాలో తెలియక తడబడ్డాను. నా భర్తను చూసి అన్నయ్య, చిన్న అన్నయ్య అని పిలవడం మొదలుపెట్టాను. కానీ అది కేవలం పిలుపు మాత్రమే కాదు.. నా మనసులోని గాఢమైన భావంగా మారింది" అని ఆమె పేర్కొన్నారు. "నాకు సోదరులు లేకపోయినా, ఈ జీవితం నాకు ఇద్దరిని కానుకగా ఇచ్చింది" అంటూ అన్నా చేసిన కామెంట్స్ మెగా ఫ్యామిలీలోని బాండింగ్ ఏంటో ప్రపంచానికి చాటిచెప్పాయి.
అన్నా కొణిదెల తన ఇన్ స్టా బయోలో "Russian Heart, indian Soul" అని పేర్కొనడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.రష్యాలో పుట్టినా, మెగా కోడలిగా భారతీయ సంప్రదాయాలను గౌరవిస్తూ ఆమె సాగిస్తున్న ప్రయాణం అందరినీ ఆకట్టుకుంటోంది. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని అరుదైన విషయాలు ఇకపై అన్నా ద్వారా ఫ్యాన్స్‌కు తెలిసే అవకాశం ఉంది.అకౌంట్ ఓపెన్ చేసిన కొద్ది సేపటికే 2 లక్షల మంది ఫాలోవర్స్ దాటడం చూస్తుంటే, పవర్ స్టార్ ఇమేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతోంది. పవన్‌తో కలిసి ఉన్న ఫోటోలు చూసి ఫ్యాన్స్ ‘మా వదినమ్మ వచ్చేశారు’ అంటూ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు.అన్నా కొణిదెల సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్‌కు ఒక కొత్త కిక్ ఇచ్చారు.అన్నా కొణిదెల ఎంట్రీ ఇప్పుడు టాప్ ట్రెండింగ్‌లో ఉంది.