బాయ్ ఫ్రెండ్ గురించి సంచలన నిజాన్ని బయటపెట్టిన జబర్దస్త్ రోహిణి..!?

Anilkumar
తెలుగు బుల్లితెరపై లేడీ కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేక పాపులారిటీని సంపాదించుకున్న నటి రోహిణి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సీరియల్స్ ద్వారా మొదట క్రేజ్ సంపాదించుకున్న ఆమె జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింత క్రేజ్ తెచ్చుకుంది దాని తర్వాత బిగ్ బాస్ లో కంటెస్టెంట్గా ఎంట్రీ కూడా ఇచ్చింది. అయితే ఈ షో తర్వాత పలు షో లలో అవకాశాలు అందుకున్న ఆమె సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటుంది. తనకి సంబంధించిన రకరకాల విషయాలను తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంది. అయితే ఈ మధ్యకాలంలోనే పలు సినిమాలు మరియు వెబ్ సిరీస్లలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

ముఖ్యంగా పండగ ఈవెంట్లలో చేస్తూ ఇతర చానల్స్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే గడిచిన కొద్ది రోజుల క్రితం తన కాలుకి ఒక సర్జరీ చేయించుకుంది అన్న విషయాన్ని తెలియజేస్తుంది ఆమె. అయితే ఆ సమయంలో తన ఎంత బాధపడిందో కొద్ది రోజులు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత మళ్లీ ఇప్పుడిప్పుడే షోలు చేయడం మళ్ళీ మొదలు పెట్టింది. తాజాగా ఒక షోలో మొదటిసారి రోహిణి తన బ్రేకప్ గురించి సంచలన విషయాన్ని బయట పెట్టింది. అయితే ఇప్పటి వరకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేదా అన్న విషయం చాలామందికి తెలియదు అని చెప్పుకొచ్చింది..

తాజాగా తనకి ఒకప్పుడు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు అని కానీ ఇప్పుడు బ్రేకప్ అయ్యింది అని తెలియజేసింది. బ్రేకప్ తర్వాత చాలా నరకాన్ని అనుభవించాను అని ఆ సమయంలో తన స్నేహితులు తనకు చాలా అండగా ఉన్నారు అని తెలియజేసింది ఆమె. నా ఫ్రెండ్స్ అందరూ కూడా తన వెంటే ఉంటూ తనని బాగా సపోర్ట్ చేశారు అని సందర్భంగా ఆమె తెలియజేసింది. దాంతో ఆమె చేసిన వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: