ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా అనేక సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడబోతున్నాయి. అందులో భాగంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్న నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా రూపొందిన భగవంత్ కేసరి సినిమా ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 19 వ తేదీన విడుదల కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా ... శ్రీ లీల ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో కనిపించనుంది.
ఇకపోతే ఈ మూవీ విడుదల అయిన తదుపరి రోజు అనగా అక్టోబర్ 20 వ తేదీన మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన టైగర్ నాగేశ్వరరావు సినిమా విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో కూడా విడుదల కానుంది. ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ రెండు సినిమాలపై తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న ఈ రెండు మూవీ లతో పోటీగా తమిళ స్టార్ హీరో విజయ్ తలపతి హీరోగా రూపొందిన లియో సినిమా కూడా విడుదల కానుంది. ఈ సినిమాను అక్టోబర్ 19 వ తేదీన విడుదల చేయనున్నారు.
ఇకపోతే ఈ సినిమాకు లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించగా ... త్రిష ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే భగవంత్ కేసరి ... టైగర్ నాగేశ్వరరావు మూవీ లకు కనక మంచి పాజిటివ్ టాక్ వచ్చినట్లు అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా లియో మూవీ కి భారీ కలెక్షన్ లు వచ్చే అవకాశాలు చాలా తక్కువే అని చెప్పవచ్చు. మరి ఈ రెండు భారీ క్రేజ్ ఉన్న తెలుగు మూవీ లతో పోటీ పడి లియో మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.