స్పై హీరోగా మారిన వెన్నెల కిషోర్.. గ్లింప్స్ వైరల్..!!
గతంలో కూడా కొంతమంది కమెడియన్సు సైతం హీరోగా మారి బాగానే సక్సెస్ అయ్యారు..ఇప్పుడు వారి జాబితాలో వెన్నెల కిషోర్ కూడా చేయరా బోతున్నారు. అక్కినేని హీరో సుమంత్ నటించిన మళ్లీ మొదలైంది సినిమాని తెరకెక్కించిన డైరెక్టర్ టిజి కీర్తి కుమార్ వెన్నెల కిషోర్ తో కలిసి ఒక సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా పేరు చాలా డిఫరెంట్ గా ఉన్నది.. ఆ సినిమా పేరు "చారి-111 "ఈ చిత్రంలో సీనియర్ నటుడు మురళి శర్మ కూడా కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది. సంయుక్త విశ్వనాథ హీరోయిన్గా కనిపించబోతోంది.
ఈ సినిమా ఫస్ట్ లుక్ అదిరిపోయేలా ఉన్నది..ఇందులో వెన్నెల కిషోర్ సూటు బూటు వేసుకొని చేతిలో ఒక గన్ను పట్టుకొని మరి కనిపిస్తూ ఉన్నారు. ఈ పోస్టర్ ఒక మోషన్ తరహాలో డిజైన్ చేసినట్టుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఒక గ్లింప్స్ వైరల్ గా మారుతుంది.. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది ఇందులో మరొక నటుడు బ్రహ్మాజీ, సత్య, రాహుల్ రవీంద్రన్ కూడా నటిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది. మరి కామెడీ రోలర్ కోస్టర్ రైడ్ తరహాలో వస్తున్న చారి సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి మరి