విక్టరీ వెంకటేష్ ... ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా మిల్కీ బ్యూటీ తమన్నా ... మెహరీన్ హీరోయిన్ లుగా ఎఫ్ 2 అనే మూవీ కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా ... దిల్ రాజు ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించాడు. ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ మూవీ విజయంలో దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా కీలక పాత్రను పోషించింది.
ఇకపోతే ఎఫ్ 2 మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకొని భారీ కలెక్షన్ లను వసూలు చేయడంతో ఈ మూవీ మేకర్స్ ఎఫ్ 3 అనే పేరుతో మరో మూవీ ని రూపొందించారు. ఈ సినిమాలో కూడా వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా నటించగా తమన్నా , మెహరీన్ హీరోయిన్ లుగా నటించారు. అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా , దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు. ఇకపోతే దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ఎఫ్ 2 రేంజ్ విజయ్ ని అందుకోలేక పోయినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే తెలుగు సినీ ప్రేమికులను పరవాలేదు అనే రీతిలో అలరించిన ఈ సినిమా హిందీ సినీ బుల్లి తెర ప్రేమికులను అలరించడానికి రెడీ అయింది.
ఈ మూవీ హిందీ వర్షన్ సాటిలైట్ హక్కులను గోల్డ్ మైన్స్ టీవీ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఎఫ్ 3 అనే పేరుతోనే ఈ టీవీ ఛానల్లో ఆగస్టు 27 వ తేదీన ఆదివారం 8 గంటలకు మొదటి సారి బుల్లి తెరపై ఈ మూవీ ప్రసారం కానుంది. ఇకపోతే ఇప్పటికే తెలుగు సినీ ప్రేమికులను ఎంతగానో అలరించిన ఈ సినిమా హిందీ బుల్లి తెర ప్రేమికులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.