ఓటీటి లో విడుదల కాబోతున్న పవన్ కళ్యాణ్ బ్రో మూవీ..!!

Divya
భీమ్లా నాయక్ సినిమాతో వరుసగా సినిమాలు చేస్తే పవన్ కళ్యాణ్ అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇస్తున్నారు. ఇటీవలే బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా తమిళంలో విడుదలైన వినోదయ సీతం సినిమాకి రీమిక్కుగా తెరకెక్కించారు. ఈ సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు రాగా మల్టీ స్టార్లర్ చిత్రంగా విడుదల కావడం జరిగింది. 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ స్టైల్ యాక్టింగ్ అన్ని కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నట్లు సమాచారం.
మరొక హీరో సాయిధరమ్ తేజ్ కూడా ఇందులో అద్భుతమైన నటన ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో థియేటర్లో ప్రేక్షకులను అలరించిన బ్రో సినిమా ఓటీడీ కోసం అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు తాజాగా అందుకు సంబంధించి ఒక అప్డేట్ విడుదల కావడం జరిగింది.బ్రో ది అవతార్ చిత్రం డిజిటల్ స్ట్రిమింగ్ రైట్స్ ప్రముఖ ఓటీటి ప్లాట్ ఫామ్  నెట్ ఫ్లెక్స్ ఈ సినిమా రైట్స్ ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఆగస్టు 25న ట్రిమ్మింగ్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఒకవేళ ఈ డేట్ కాకపోతే పవన్ కళ్యాణ్ బర్తడే సందర్భంగా సెప్టెంబర్ 2న ఓటిటి లో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. వారం ముందే ఓటీపీలోకి అందుబాటులోకి రాబోతున్న ఈ సినిమా మెగా ఫ్యాన్స్ ని అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. పీపుల్ మీడియా బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాని నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా విడుదలైన తరువాత కూడా చాలా పాపులారిటీ అందుకున్నది. మరి బ్రో సినిమా థియేటర్లు మిస్సయిన వారు ఓటీటి లో ఎంజాయ్ చేయవచ్చు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు ఒకవైపు ప్రేక్షకులను మెప్పిస్తూనే మరొకవైపు రాజకీయాలలో పాల్గొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: