విజయ్ దేవరకొండ వేసుకున్న ఈ డ్రెస్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
ప్రస్తుతం యూత్ లో క్రేజ్ ఉన్న హీరోగా విజయ్ దేవరకొండ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దాంతోపాటు విజయ్ దేవరకొండకు అమ్మాయిల్లో ఒక రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కేవలం మామూలు జనాలకే కాకుండా విజయ్ దేవరకొండ చాలామంది స్టార్ హీరోయిన్ లకి కూడా ఫేవరెట్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక్కసారైనా ఆయనతో కలిసి డేటింగ్ చేయాలి అంటూ ఇప్పటికీ చాలామంది హీరోయిన్లు ఓపెన్ గా చెప్పిన సంగతి కూడా చాలామందికి తెలిసి ఉంటుంది. ఇక అలాంటి విజయ్ దేవరకొండ ఒకప్పుడు సినిమా ప్రమోషన్స్ కి వస్తే వేసుకోవడానికి సరైన డ్రెస్ కూడా లేదు అంటూ ఒక ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని  విజయ్ చెప్పిన సంగతి తెలిసిందే.


 కానీ అలాంటిది ఇప్పుడు రౌడీ వేరర్ అనే ఒక క్లాత్ బ్రాండ్ ని కూడా ప్రవేశపెట్టి ఎన్నో విభిన్నమైన డిజైన్లు ఉన్న డ్రెస్సులను వేసుకుంటూ ఎంతో స్టైలిష్ గా కనిపిస్తాడు విజయ్. ఇలా అప్పట్లో అల్లు అర్జున్ వేసుకునే పలు రకాల స్టైల్స్ డ్రెస్లను చూసి అమ్మాయిలు ఫిదా అయ్యేవారు. కానీ ప్రస్తుతం విజయ్ దేవరకొండ స్టైల్ కి ఫిదా అవుతున్నారు. ఇప్పటికే ఎన్నో సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్ లో రకరకాల డ్రస్సులను వేసుకుంటూ అందరికీ షాక్ ఇచ్చిన విజయ్ తాజాగా ఇప్పుడు ఖుషి మ్యూజిక్ కన్సర్ట్ లో కూడా ఆయన వేసుకున్న డ్రెస్ అందరినీ ఆకర్షిస్తుంది. అయితే ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ వేసుకున్న ఆ డ్రెస్ ధర తెలిసి షాక్ అవుతున్నారు.


ఇక విజయ్ దేవరకొండ ఈ సందర్భంగా వేసుకున్న డ్రస్సు ధర ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.. సమంత విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ సినిమా ఖుషి. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ని  జరుపుతున్నారు చిత్ర బృందం .ఇందులో భాగంగానే హైదరాబాదులో  మ్యూజిక్ కన్సర్ట్ ని ఏర్పాటు చేశారు.  ఈ కార్యక్రమానికి వచ్చిన విజయ్ దేవరకొండ వేసిన డ్రెస్ చాలా సింపుల్గా వైట్ కలర్ పలాజో టైప్ అలాగే వైట్ కోర్టు ధరించి చాలా వెరైటీగా కనిపించాడు విజయ్. కాగా ఆయన వేసుకున్న డ్రెస్ అందరిలో కన్నా చాలా విభిన్నంగా ఉండడంతో అందరి దృష్టి విజయ్ దేవరకొండ వేసుకున్న డ్రెస్ పైనే పడింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం విజయ్  వేసుకున్న ఆ డ్రెస్సు ధర దాదాపుగా మూడు లక్షలకు పైగానే ఉంటుందని అంటున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: