విజయ్ దేవరకొండకు అలాంటి భార్యే కావాలి : సమంత
ఈ క్రమంలో సమంతకి ఒక యూట్యూబ్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో సమంతకి విజయ్ గురించి ఒక ప్రశ్న వచ్చింది. విజయ్ ఎలాంటి భార్య కావాలి అని అడగగా, సమంత స్పందిస్తూ ఆమె చాలా సాధారణంగా ఉండాలి. అతడి కుటుంబంతో కలిసిపోవాలి’ అని తెలిపారు. ఈ సమాధానాలకు విజయ్ కూడా కరెక్ట్ అంటూ స్పందించారు. అంతేకాదు సమంత మాట్లాడుతూ విజయ్ కి చాలా మంది స్నేహితులు ఉన్నారని, ఎక్కువగా ఫోన్ కాల్స్ మాట్లాడాడని, చాలా తక్కువగా మాట్లాడుతాడని, కానీ మెసేజ్ లు ఎక్కువగా చేస్తుంటాడని, విజయ్ బాగా నచ్చిన చిత్రం బేబీ అని, విజయ్ ఎక్కువగా గేమింగ్ యాప్ లు వాడుతుంటాడని సమంత చెప్పింది.
ఆగష్టు 15 న జరిగిన ఈవెంట్ లో విజయ్ మాట్లాడుతూ ఈ సినిమా కోసం సమంత చాలా కష్టపడ్డారని, సినిమా విడుదలయ్యాక సమంత మొఖంలో నవ్వు చూడాలని ఉందని విజయ్ అన్నాడు. రాహుల్ రవీంద్రన్, చిన్మయి, నీరజ కోన, మేఘన.. వీళ్లు సమంత బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పాడు. ఈ ఈవెంట్ లో స్టేజి మీద విజయ్-సమంత డ్యాన్స్ చేసి ఫ్యాన్స్ ని అలరించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సినిమా ముందు విజయ్, సమంత కలిసి మహానటి సినిమాలో నటించారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వగా, ఈ సినిమా కూడా కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుందని ఆశిస్తున్నారు. సెప్టెంబర్ 1 న ఖుషి సినిమా విడుదల కానుంది.