లైవ్ లోనే.. నవీన్ పోలిశెట్టికి అనుష్క ఫ్రాంక్ కాల్.. ఓ ఆటాడుకుంది?
అయితే ఈ సినిమా తర్వాత ఎందుకో కెరీర్ లో జోరు తగ్గించింది ఈ ముద్దుగుమ్మ. మధ్యలో నిశ్శబ్దం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆమె కెరియర్ కు ఉపయోగపడలేదు. దాదాపు మూడేళ్ల గ్యాప్ తీసుకున్న స్వీటీ పాప ఇక ఇప్పుడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి మిస్ షెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. మరి కొన్ని రోజుల్లో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. కొత్త దర్శకుడు మహేష్ ఈ సినిమాకు డైరెక్టర్ గా పని చేశారు. యు వి క్రియేషన్స్ పై సినిమా రూపుదిద్దుకుంది అని చెప్పాలి. అయితే సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టింది.
ప్రస్తుతం అయితే హీరో నవీన్ పోలిశెట్టి ఒక్కడే ప్రమోషన్ బాధ్యతలను భుజాన వేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్లో ఒక ఈవెంట్ లో పాల్గొన్న నవీన్ పోలిశెట్టి ఇటీవలే ఒక స్టూడియో ఇంటర్వ్యూకు కూడా వెళ్ళాడు. అయితే లైవ్ కొనసాగుతున్న సమయంలో అనుష్క శెట్టి నవీన్ కి ప్రాంక్ కాల్ చేసింది. దాదాపు నాలుగు నిమిషాల పాటు నవీన్ తో ఒక ఆట ఆడుకుంది. అనవసరమైన కామెడీ చేస్తే స్టాండప్ కమెడియన్ కావాలి అంటూ సెటైర్లు వేసింది అనుష్క. అయితే మొదట నవీన్ పోలిశెట్టి అనుష్క వాయిస్ ను అస్సలు గుర్తుపట్టలేదు. దాదాపు నాలుగు నిమిషాల తర్వాత అనుష్కను గుర్తుపట్టాడు. ఇక ఈ వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది.