ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఫ్యాన్ ఇండియా స్టార్ గా చలామణి అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ స్టార్ హీరో గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అల్లు అర్జున్ ఒకప్పుడు ఎలా ఉండేవాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. కేవలం పుష్ప సినిమాతో తన రేంజ్ ఏకంగా ఫ్యాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. అంతేకాదు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా ఆయనకి ఒక రేంజ్ లో క్రేజ్ ఏర్పడింది. అయితే అలా అల్లు అర్జున్ తో దేశముదురు సినిమాలో హీరోయిన్ గా నటించిన హీరోయిన్ హన్సిక గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఈ నేపథ్యంలో ఏ తాజాగా అల్లు అర్జున్ పై పలు కామెంట్స్ చేయడం జరిగింది. దింతో ప్రస్తుతం ఆ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే హన్సిక అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన దేశంముదురు సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాతోనే హన్సిక తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమైంది. అయితే ఆ సినిమా షూటింగ్ సమయంలో అల్లు అర్జున్ హన్సిక ని ఒకరోజు బలవంతంగా పబ్బుకి తీసుకువెళ్లాడట అల్లు అర్జున్. వద్దు అని చెప్పిన కూడా వినకుండా బలవంతంగా అల్లు అర్జున్ తనని పబ్బుకి తీసుకువెళ్లాడుట.
'దేశముదురు' సినిమా షూటింగ్ నడుస్తున్న సమయంలో హన్సిక పుట్టినరోజు వచ్చింది. దీంతో అల్లు అర్జున్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇద్దరు కలిసి ఆమెను పబ్బుకి తీసుకువెళ్లి తన బర్త్డే సెలబ్రేషన్స్ చేశారట. ఆమెను బలవంతంగా పబ్బుకి తీసుకువెళ్లి వేడివేడి పాలను కూడా తాగించారట. అలా తన బర్తడే సెలబ్రేషన్స్ చేశాడట అల్లు అర్జున్. ఇక ఇతర డ్రింక్స్ కూడా తనతో బలవంతంగా తాగించారు అని ఈ సందర్భంగా హన్సిక పేర్కొంది. ఇలా 15 ఏళ్ల కింద జరిగిన సంఘటనను తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించింది హన్సిక .దీంతో ఆమె మాట్లాడిన మాటలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!