టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న అనిల్ రావిపూడి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో అనిల్ రావిపూడి నాలుగు స్తంభాలాట ఆడుతున్నాడు అని అందరూ అంటున్నారు. ఇప్పటికి రెండు స్తంభాలాంటి వెంకీ బాలకృష్ణ లతో సినిమాలో తీసేసాడు. మిగిలింది మెగాస్టార్ చిరంజీవి మరియు నాగార్జునలు మాత్రమే. ఇక మెగా ఆఫర్ తో అనిల్ రావిపూడి లెక్కలే మారిపోతున్నాయని తెలుస్తోంది. తాజాగా ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాతో దసరాను టార్గెట్ చేశాడు ఈ స్టార్ డైరెక్టర్. దాంతోపాటు బాలయ్యతో చేసిన ప్రయోగంతో నవరాత్రికి కాసులు ఇంటికి చేరతాయి అని అనుకుంటున్నాడు.
ఇప్పటికే వెంకటేష్ తో కలిసి తీసిన ఎఫ్ త్రీ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో తెలిసింది. ఈ సినిమాతో మూడో హ్యాట్రిక్ తెరుచుకున్నట్టే అని అంటున్నారు చాలామంది. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏమిటి అంటే ఇండస్ట్రీలోకి నాలుగు స్తంభాలాంటి వాళ్ళు చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వెంకటేష్. అయితే ఇందులో ఇప్పటికే ఇద్దరితో సినిమాలను తీసేసాడు ఈ డైరెక్టర్. కొత్తగా ఇప్పుడు చిరంజీవితో సినిమా చేసే మరొక బంపర్ ఆఫర్ ను కొట్టేసినట్లుగా తెలుస్తోంది. అయితే దీపావళి నుండి వేగం పెంచబోతున్నాడట అనిల్ రావిపూడి. చిరంజీవి కూడా త్రివిక్రమ్ స్క్రిప్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే ఇప్పుడు అనిల్ రావిపూడి మేకింగ్లో దిల్ రాజు తీసే సినిమా పట్టాలికితే లెక్కలే మారిపోతాయి. పెద్ద హీరోలతో కామెడీ కం యాక్షన్ డ్రామా జానర్ లో సక్సెస్ అందుకున్న దర్శకుడిగా అని రావిపూడి కి మంచి రికార్డ్ ఉంది. గతంలో ఎఫ్ 2 ఎఫ్ 3 సినిమాలతో హిట్ అందుకున్న ఆయన బాలకృష్ణతో భగవంత్ కేసరి సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా తరువాత మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమాని చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. దాని తర్వాత నాగార్జున అని టార్గెట్ చేస్తున్నాడు ఈ స్టార్ డైరెక్టర్. బంగార్రాజు సమయంలోనే కుదరాల్సిన వీరిద్దరి కాంబినేషన్ ఇప్పటి వరకు కుదరలేదు. దాంతో వీరిద్దరితో కూడా త్వరలోనే సినిమా చేస్తున్నాడట అనిల్ రావిపూడి..!!