అతను నటించడం వల్లే.. చిరు మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయా?

praveen
రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు అనే విషయం తెలిసింది. అయితే మెగాస్టార్ సినిమాలో అయితే చేస్తున్నారు కానీ ఎందుకో బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను మాత్రం అందుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వరకు మెగాస్టార్ చిరంజీవి నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరుస్తూనే వచ్చాయి. మొన్నటికి మొన్న వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన చిరంజీవి ఇక అంతకుముందు ఆచార్య, గాడ్ ఫాదర్.. సినిమాతో ఫ్లాప్ చూసారూ. ఇక  మరో రీమేక్ మూవీ బోలా శంకర్ తోను  ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి నిరాశ పరిచాడు చిరంజీవి.


 అయితే మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలు వరుసగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బోల్తాపడుతున్న నేపథ్యంలో అభిమానులు అందరూ కూడా నిరాశలో మునిగిపోతున్నారు అని చెప్పాలి. అయితే ఈ మూడు సినిమాల్లో ఒక వ్యక్తి నటించాడని అతని వల్లే సినిమాలు ఫ్లాప్ అయ్యాయని కొన్ని అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి. అతను ఎవరో కాదు మెగా ఫ్యామిలీకి చెందిన కొణిదెల పవన్ తేజ్. మెగాస్టార్ కారణంగా ఇక ఆయన నటిస్తున్న సినిమాలలో అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు కొణిదల పవన్ తేజ్. ఈ మూడు సినిమాలలోను పెద్దగా గుర్తింపు లేని పాత్రల్లో కనిపించారు కొణిదెల పవన్ తేజ్.



 అయితే పవన్ తేజ్ నటించిన మూడు మెగాస్టార్ సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి. దీంతో అతని కారణంగానే చిరు సినిమాలకు దురదృష్టం పడుతుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇకనుంచి అయినా మెగాస్టార్ చిరంజీవి తన సినిమాలలో కొణిదల పవన్ తేజను ఎంచుకోవద్దు అని నెటిజెన్లు రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే చిరంజీవి సెంటిమెంట్లను పెద్దగా పట్టించుకోరు. మరి అభిమానులు కోరుకున్నట్లుగా కొణిదల పవన్ తేజ్ ను  చిరంజీవి పక్కకు పెడతారా.. లేదంటే మళ్ళీ సినిమాలలో అవకాశం ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే జయాపజయాలతో సంబంధం లేకుండా చిరంజీవి క్రేజ్ అంతకంతకు పెరుగుతుండడంతో అభిమానులు మాత్రం కాస్త సంతోషంగానే ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: