కన్ఫ్యూజన్లో పడ్డ 'బేబీ' హీరోయిన్.. కొత్త సినిమా ఎప్పుడంటే..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చిన్న సినిమాలుగా వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఒకవేళ మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ వసూళ్లు సాధించిన సందర్భాలు కూడా చాలా తక్కువే. అలాంటిది ఈ రెండు విషయాల్లో బేబీ సినిమా సంచలనాన్ని సృష్టించింది అని చెప్పాలి. ఎటువంటి అంచనాలు లేకుండా కొన్నాళ్ళు ముందు థియేటర్లోకి వచ్చిన ఈ సినిమాలో వైష్ణవి చైతన్య అనే తెలుగమ్మాయి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అందుకోవడంతో చిరంజీవి అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు సైతం ఈమెని పొగడ్తలతో ముంచారు. 

కట్ చేస్తే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మని ఎవరు పెద్దగా పట్టించుకోవడంలేదని అంటున్నారు. టిక్ టాక్ వీడియోలతో మంచిగా గుర్తింపును తెచ్చుకున్న ఈమె దాని తర్వాత యూట్యూబర్ గా మారింది. కవర్ సాంగ్స్ షార్ట్ ఫిలిమ్స్ వంటివి చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే తన కథకు సరిగ్గా సరిపోతుందని భావించిన దర్శకుడు బేబీ సినిమాలో హీరోయిన్గా వైష్ణవిని ఎంపిక చేశారు. బోల్డ్ స్టోరీకి తోడు ఈ మెకి కూడా మంచి పేరు రావడంతో ఈ సినిమా తర్వాత తనకి వరుస సినిమాలో అవకాశాలు వస్తాయి అని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు.

బేబీ ప్రొడ్యూసర్ SKN తీయబోయే రెండు కొత్త సినిమాలు కూడా వైష్ణవి చైతన్యనే హీరోయిన్ అన్న టాక్ వినబడుతోంది. ఇక వీటికి ఇంకా చాలా టైం ఉందని కూడా అంటున్నారు. ఇక ఆ సినిమాలతో పాటు యంగ్ హీరో రామ్ మరియు అల్లు శిరీష సినిమాల్లో కూడా వైష్ణవి చైతన్యను హీరోయిన్గా తీసుకున్నారు అన్న సమాచారం కూడా వినబడుతుంది. ఇక ఈ విషయాలపై క్లారిటీ మాత్రం ఇంకా రాలేదు. బేబీ సినిమాలో తన క్యారెక్టర్ బోల్డ్ గా ఉండడం వల్ల తనకి పెద్ద నిర్మాణ సంస్థల నుండి ఆఫర్స్ రావడం లేదు అన్న కారణాలు కూడా వినపడుతున్నాయి. దీంతో వైష్ణవి చైతన్య కన్ఫ్యూషన్ లో పడిపోయింది అని అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: