జైలర్ సినిమా హిట్ కాదనుకున్న.. రజినీకాంత్ సంచలన వ్యాఖ్యలు?
ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే రూ. 200 కోట్లు వసూలు చేసి రజినీకాంత్ సత్తాని చూపించింది. జైలర్ సినిమాలో రజినీకాంత్ నటన, మోహన్ లాల్, శివన్న క్యామియో, అనిరుద్ అందించిన సంగీతం ఒక రేంజ్ లో ఉన్నాయి. అయితే బీస్ట్ సినిమాతో పరాజయాన్ని రుచి చూసిన నెల్సన్ తో సినిమా వద్దని రజినికి చాలా మంది చెప్పారట. అయినా కూడా రజనీకాంత్ వారెవరి మాటలు వినకుండా కథని నమ్మి జైలర్ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడట. ఈ సినిమా రిలీజ్ కి ఒక్కరోజు ముందే రజనీకాంత్ హిమాలయాలకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు సినిమా సూపర్ హిట్ అయ్యింది.
దాంతో తాజాగా రజినీకాంత్ బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించి, ఆ తరువాత రిషికేష్ లోని స్వామి దయానంద గురూజీ ఆశ్రమంలో ప్రత్యక్షమయ్యాడు. ఈ సందర్భంగా రజినీకాంత్ సినిమా విజయం గురించి స్పందించాడు. ఆయన మాట్లాడుతూ 'జైలర్ సినిమా షూటింగ్ సమయంలో చాలా ఒత్తిడిగా అనిపించేది. ఆ ఒత్తిడికి నేను కూడా లోనయ్యాను. ఒకానొక సందర్భంలో అసలు ఈ సినిమా హిట్ అవుతుందా? అనే అనుమానం కూడా నాకు వచ్చింది. ఆ సమయంలోనే స్వామీజీ నాకు ఒక మాట చెప్పారు. సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది నువ్వేం కంగారు పడకు అని ఆయన చెప్పారు. ఇక ఆ తరువాత నాలో ఉన్న కంగారు తగ్గింది, జైలర్ సినిమా రిజల్ట్స్ గురించి ఆలోచించడం మానేసాను. స్వామీజీ చెప్పినట్టుగానే సినిమా రిలీజ్ అయి మంచి విజయం సాధించింది.' అని తెలిపారు. ప్రస్తుతం రజినీ 'జైలర్' సినిమా గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.