'గుంటూరు కారం' కొత్త షెడ్యూల్ స్టార్ట్.. ఆ సీన్స్ పైనే గురూజీ ఫోకస్.. !?

Anilkumar
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న సినిమా గుంటూరు కారం. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు ఆయన అభిమానులు. ఏ చిన్న మ్యాటర్ తెలిసిన కూడా ఒక రేంజ్ లో సెలబ్రేషన్స్ చేసుకుంటారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చింది వెకేషన్ నుండి ఇండియాకు వచ్చిన మహేష్ బాబు షూటింగ్లో ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు.. గురూజీ నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు.. సంక్రాంతికి వచ్చేందుకు ఈ సినిమా రెడీగా ఉందా.. అన్న ప్రశ్నలు నెలకొన్నాయి.. ఇక  జూలైలో ఫారెన్ వెళ్ళిన మహేష్ బాబు అక్కడి పుట్టినరోజు వేడుకలు జరుపుకొని ఇండియాకి రావడం జరిగింది. 

ఇక వచ్చి రాగానే మహేష్ బాబు తన నెక్స్ట్ షెడ్యూల్ పై ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే గుంటూరు కారం సినిమా కొత్త షెడ్యూల్ ఆగస్టు 16 నుండి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే మహేష్ బాబు కూడా ఆ షూటింగ్లో జాయిన్ అవ్వబోతారట. అయితే ఈసారి మాత్రం ఒక భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారట త్రివిక్రమ్. నవంబర్ వరకు నాన్ స్టాప్ గా షెడ్యూల్ చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే గుంటూరు కారం సినిమా అనుకున్న దానికంటే కొంచెం ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని మహేష్ అభిమానులు ఎప్పటినుండో ఫీల్ అవుతున్నారు. కానీ అలా ఏమీ జరగదని అంటున్నారు.

అనుకున్న సమయంలోనే ఈ సినిమాని రిలీజ్ చేస్తామని నమ్మకం చెబుతున్నారు మేకర్స్. అయితే ఇటీవల మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ను విడుదల చేస్తూ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. సంక్రాంతికి మహేష్ బాబు మిర్చి ఘాటు చూపించడం ఖాయమని చెప్పుకొచ్చారు. అతడు ఖలేజా వంటి సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పటి వరకు తన హీరోలు అందరికీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన త్రివిక్రమ్ ఈ సినిమాతో ఎటువంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: