ఎన్టీఆర్ దేవర మూవీలో.. తారక్ కు అత్తగా నటించనున్న హీరోయిన్?
ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత ఎలాగైనా ఇండస్ట్రీ హీట్ కొట్టాలనే కసితో ఉన్న కొరటాల శివ ఇక ఎన్టీఆర్ కోసం ఒక పవర్ఫుల్ కథను సిద్ధం చేసుకుని ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమా తీసేందుకు ఆహర్నిశలు కష్టపడుతున్నారు. అయితే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ నటిస్తూ ఉంది. తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించబోతుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది అని చెప్పాలి. అయితే ఎన్టీఆర్ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారన్న టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే జాన్వి కపూర్ కన్ఫార్మ్ కాగా రెండో హీరోయిన్ ఎవరు అన్నది తెలియాల్సి ఉంది.
అయితే ఇప్పుడు ఎన్టీఆర్ దేవర సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుంది. దేవర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అత్త పాత్ర ఎంతో కీలకంగా ఉండబోతుందట. అయితే ఈ పాత్ర కోసం ఏకంగా కొరటాల శివ ఒక హీరోయిన్ ను రంగంలోకి దింపబోతున్నాడట. ఆ హీరోయిన్ ఎవరో కాదు రమ్యకృష్ణ. ఎన్టీఆర్ రమ్యకృష్ణ కలిసి ఇప్పటికే నా అల్లుడు సినిమాలో అత్త అల్లుళ్ల పాత్రలో నటించారు. మళ్లీ ఇన్నాళ్లకు దేవర సినిమాలో రెండోసారి అత్త అల్లుళ్ల పాత్రలో కనిపించబోతున్నారు. ఇంటర్వెల్లో ఇక ఈ సినిమా కథ మలుపు తిరుగుతుందని.. అప్పుడే రమ్యకృష్ణ ఎంట్రీ కూడా ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ ఒకటి చక్కర్లు కొడుతుంది. ఇక ఇది ఎంత నిజమో తెలియాలంటే మాత్రం అఫీషియల్ ప్రకటన వచ్చేంత వరకు ఆగాల్సిందే.