ఆర్తి అగర్వాల్ ఇబ్బందులకు కారణం ఆయన తండ్రి అంటున్న నిర్మాత....!!

murali krishna
నటి ఆర్తి అగర్వా ల్ఈ హీరోయిన్ పేరు చెప్తే ఇప్పటికి కూడా కన్నీళ్లు పెట్టుకునే అభిమానులు ఎంతో మంది ఉన్నారు.బొద్దుగా ఉన్నప్పటికి కూడా తన భారీ అంద చందాలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.తన అందచందాలకి చాలామంది అప్పటి యూత్ అట్రాక్ట్ అయ్యారు. అయితే ఈ హీరోయిన్ తరుణ్ తో ప్రేమలో పడి ఆ ప్రేమ విఫలమై సూసైడ్ వరకు వెళ్లి చివరికి తల్లిదండ్రులను కాదనలేక పెళ్లి చేసుకొని భర్తతో కలిసి ఉండలేక విడాకులు ఇచ్చి మళ్లీ సినిమాల్లో రాణిద్దామని కొవ్వు తగ్గించుకోవాలని లైపోజెషన్ ఆపరేషన్ చేయించుకొని అది సక్సెస్ కాకపోవడంతో మరణించింది.ఇలా ఈమె జీవితంలో సినీ కెరియర్ సక్సెస్ అయినప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఇప్పటికే ఎన్నో వార్తలు వినిపించాయి.

అయితే ఆర్తి అగర్వాల్ అంత నరకం అనుభవించడానికి కారణం తన సొంత తండ్రి అంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు నిర్మాత చంటి అడ్డాల కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంటి అడ్డాల మాట్లాడుతూ.. నేను ప్రొడ్యూస్ చేసిన అల్లరి రాముడు, అడవి రాముడు రెండు సినిమాల్లో ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా తీసుకుంది.అయితే అల్లరి రాముడు సినిమాలో ముందుగా చార్మిని అనుకుంటే ఎన్టీఆర్ లావుగా ఉన్నారు ఛార్మి కూడా లావుగా ఉంటే సినిమా హిట్ అవ్వదని గోపాల్ గారు చెప్పడంతో అప్పట్లో మంచి ఫామ్ లో ఉన్న ఆర్తి అగర్వాల్ ని ఇందులో హీరోయిన్ గా పెట్టాం.

అలాగే ఆ తర్వాత కూడా అడవి రాముడు సినిమాలో హీరోయిన్ గా ఆర్తి అగర్వాల్ కి ఛాన్స్ ఇచ్చారు.ఇక ఈ రెండు సినిమాల్లో ఆర్తి అగర్వాల్ కి అవకాశం ఇచ్చిన నిర్మాతగా నాకు ఇక ఆర్తి అగర్వాల్ మంచి బంధం ఉండేది. కానీ ఆర్తి చనిపోయింది అనే మరణ వార్త వినగానే నేను ఒక్కసారిగా షాక్ లోకి వెళ్లి చాలా బాధపడ్డాను. అయితే ఆర్తి అగర్వాల్ జీవితంలో తన తండ్రి సరిగ్గా చూసుకొని ఉండి ఉంటే ఆమెకు ఇన్ని కష్టాలు వచ్చి ఉండేవి కావు. తండ్రి వల్లే ఆర్తి అగర్వాల్ ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది.ఆర్తి అగర్వాల్ తండ్రి షూటింగ్ టైంలో కూడా ఆమెకు సరిగ్గా సహకరించేవారు కాదు. అలాగే ఆ టైంలో ఆర్తి అగర్వాల్ పూర్తిగా అమ్మానాన్నల మీదే ఆధారపడుతూ ఉండేది. ఈ కారణంగానే ఆర్తి అగర్వాల్ జీవితం అలా అయిపోయింది అంటూ నిర్మాత చంటి అడ్డాల ఆ ఇంటర్వ్యూలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: