సాయి పల్లవి వింత అలవవాటు !

Seetha Sailaja
‘ఫిదా’ మూవీ తరువాత సాయి పల్లవి నటించిన సినిమాలు ‘లవ్ స్టోరీ’ ‘విరాటపర్వం’ విడుదల అయినప్పటికీ ఆమూవీలు ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదు. ఆతరువాత ఆమె నుంచి ఏ సినిమా రాలేదు. దీనితో ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీని పక్కకు పెడుతోంది అంటూ కొందరు ఆమెకు పెళ్లి కుదరడంతో తనకు తానే సినిమా అవకాశాలను వదులుకుంటోంది అంటూ మరికొందరు రకరకాల ఊహాగానాలు చేశారు.



అయితే ఆమె లేటెస్ట్ గా తమిళ హీరో శివ కార్తికేయన్ తో ఒక మూవీ చేస్తున్న నేపధ్యంలో ఆమెకు కథలు చెప్పాలి అని ప్రయత్నించిన కొంతమంది టాలీవుడ్ దర్శకులకు ఆమె ఏపాయింట్మెంట్ ఇవ్వడం లేదు అన్న గాసిప్పులు కూడ వచ్చాయి. ఈమధ్య లేటెస్ట్ గా ఈమె ఉత్తరాఖండ్ వెళ్ళి అక్కడ తాను చేసిన ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసిన విషయం తెలిసిందే.



చిన్నతనం నుండి బాబా భక్తురాలు అయిన సాయి పల్లవి తనకు ఉన్న ఒక వింత అలవాటును ఆమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టింది. తనకు బాబా ప్రసాదంగా భావించే విబూధి అంటే చాల ఇష్టం అని చెపుతూ తన చిన్నతనంలో తనకు ఆకలి వేసినప్పుడు విభూది తిన్న సందర్భాలు చాల ఉన్నాయి అన్న సంచలన విషయం బయటపెట్టింది.



వాస్తవానికి తాను డాక్టర్ కోర్స్ చదువుతున్నప్పటికీ విభూది ఇలా తినడం వల్ల శాస్త్ర బద్ధంగా ఎలాంటి సమస్యలు రావని తాను గ్రహించిన విషయాన్ని తెలియచేసింది. వాస్తవానికి ‘భోళాశంకర్’ మూవీలో చిరంజీవి చెల్లెలుగా ఈమెకు అవకాశం వచ్చినప్పటికీ ఆమె సరిగ్గా స్పందించకపోవడంతో కీర్తి సురేష్ వచ్చి చేరింది అని అంటారు. టాప్ హీరోయిన్ అవ్వదగ్గ అవకాశాలు ఉన్నప్పటికీ ఆమె పూర్తిగా తన కెరియర్ పట్ల పెద్దగా ఆశక్తి కనపరచదు అన్న కామెంట్స్ కూడ ఆమె పై ఉన్నాయి. ఆమె ఎన్నిరకాల రూమర్స్ వచ్చినా ఆమె ఏరూమర్ కు స్పందించదు. హీరోయిన్స్ అంతా టాప్ హీరోలతో నటించాలని ఆరాట పడుతుంటే సాయి పల్లవి మాత్రం దానికి విరుద్ధం..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: