హిమాలయాలకు పయనమైన రజనీకాంత్.. ఎందుకో తెలుసా..!?

Anilkumar
సూపర్ స్టార్ రజినీకాంత్ సాలిడ్ హిట్ కొట్టాలని ఆయన అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చేస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఆయన నటించిన సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోవడంలో విఫలమయ్యాయి. దాంతో అభిమానులు తెగ ఆందోళన నకు గురౌతున్నారు.  రజినీకాంత్ నుండి ఒక బ్లాక్ బస్టర్ సినిమా అయినా రావాలి అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు సూపర్ స్టార్ అభిమానులు. అయితే తాజాగా ఇప్పుడు ఆ ఎదురు చూపులు  ముగిసాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా నటించిన జైలర్ సినిమా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదలై 


ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా దూసుకుపోతోంది. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన ఇందులో చాలా స్టైల్ గా కనిపిస్తున్నారు. యాక్టింగ్ సైతం ఇరగదీసేశారు అని ప్రేక్షకులు ఒక రేంజ్ లో సంతోషిస్తున్నారు. థియేటర్స్ దగ్గర సూపర్ స్టార్ అభిమానుల హంగామా ఒకరి రేంజ్ లో ఉంది. అంతేకాదు మొదటి షో నుండి ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది అని అంటున్నారు .ఇదిలా ఉంటే ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఒక సెంటిమెంట్ ఉంది అన్న ప్రచారం 


 సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రతి సినిమా రిలీజ్ సమయంలో హిమాలయాలకు వెళుతూ ఉంటారని అంటున్నారు. మానసిక ప్రశాంతత కోసం ఆయన హిమాలయాలకు వెళ్లి సాధువులతో కొంత సమయాన్ని గడుపుతారట. ప్రతి సినిమా రిలీజ్ సమయంలో ఆయన ఇలాగే చేస్తూ ఉంటారని అంటున్నారు. తాజాగా ఇప్పుడు మరొకసారి హిమాలయాలకు వెళ్లారట సూపర్స్టార్ . జైలర్ సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా ఆయన హిమాలయాలకు వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది .అక్కడే కొన్ని రోజులు గడిపిన తర్వాత మళ్లీ చెన్నైకు తిరిగి వస్తారట సూపర్ స్టార్ రజినీకాంత్ ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: