ఆ తేదీన థియేటర్లలో "గుడుంబా శంకర్" మూవీ..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆయనకు ఉన్న పాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన కెరియర్ ప్రారంభంలో అనేక సినిమాలతో అద్భుతమైన విజయాలను అందుకొని అదిరిపోయే రేంజ్ ప్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే ఖుషి మూవీ తర్వాత కొంత కాలం పాటు అపజయాలను ఎదుర్కొన్న పవన్ తిరిగి జల్సా మూవీ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. అలాగే ఆ తర్వాత నుండి మధ్యలో ఒకటి రెండు సినిమాలు తప్ప విజయాలను అందుకుంటూ వస్తున్నాడు.

ఇకపోతే పవన్ కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లు ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే పవన్ కెరియర్ లో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపకపోయినప్పటికీ ఆ తర్వాత బుల్లి తెరపై మాత్రం అద్భుతమైన ఇంపాక్ట్ ను చూపిన సినిమాలు కూడా ఉన్నాయి. అలాంటి సినిమాలలో గుడుంబా శంకర్ మూవీ ఒకటి. ఈ సినిమా విడుదల అయిన సమయంలో బాక్స్ ఆఫీస్ దగ్గర బారి కలెక్షన్ లను రాబట్ట లేకపోయినప్పటికీ ఆ తర్వాత బుల్లి తెరపై మాత్రం ప్రేక్షకులను అలరిస్తూనే వస్తుంది. ఇకపోతే గుడుంబా శంకర్ మూవీ.ని ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అయినటువంటి సెప్టెంబర్ 2 వ తేదీన భారీ ఎత్తున 4 కే వర్షన్ తో థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు.

ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇకపోతే ఈ సినిమా రీ రిలీజ్ కోసం పవన్ అభిమానులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. ఇకపోతే వీర శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మీరా జాస్మిన్ హీరోయిన్ గా నటించగా ... మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ సినిమా 2004 సెప్టెంబర్ 10 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: