ఈ మధ్య కాలంలో సినిమాలు "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంత వేగంగా ఎంట్రీ ఇస్తున్నాయో మనందరికీ తెలిసిందే. సినిమాలు థియేటర్ లలో విడుదల అయ్యి మంచి టాక్ ను తెచ్చుకొని మంచి కలెక్షన్ లను వసూలు చేసినట్లు అయితే అలాంటి సినిమాలు కాస్త ఆలస్యంగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. ఒక వేళ సినిమాలు థియేటర్ లలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకోక కలెక్షన్ లను కూడా ఆశించిన రేంజ్ లో రాబట్టనట్లు అయితే అలాంటి సినిమాలు చాలా తక్కువ కాలంలోనే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. ఇకపోతే చాలా రోజుల క్రితం విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకున్న రెండు సినిమాలు మాత్రం ఇప్పటికీ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వలేదు.
అక్కినేని అఖిల్ కొంత కాలం క్రితం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఏజెంట్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 28 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా మిగిలింది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతున్న ఇప్పటి వరకు ఈ సినిమా ఏ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వలేదు.
ఇకపోతే మ్యాచో స్టార్ గోపీచంద్ కొంత కాలం క్రితం రామబాణం అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా మే 5 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ మూవీ విడుదల అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతున్న ఈ సినిమా కూడా ఏ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వలేదు.
ఇకపోతే ఇప్పటికే ఈ రెండు సినిమాలు విడుదల అయ్యి చాలా రోజులు అవుతున్న ఏ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వలేదు. అలాగే ఈ మూవీ లు ఏ డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇస్తాయి అనే విషయంపై కూడా ఎలాంటి క్లారిటీ లేదు.