చంద్రముఖిగా జ్యోతికను కంగనా మరిపిస్తుందా..!?

Anilkumar
రజనీకాంత్ జ్యోతిక నయనతార ప్రభు ప్రధాన పాత్రలో పి.వాసు దర్శకత్వంలో వచ్చిన చంద్రముఖి సినిమా ఇప్పటివరకు అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక చంద్రముఖిగా జ్యోతిక నటన ఎంతో అద్భుతంగా ఉంది. దాని తర్వాత ఆమె ఎలాంటి పాత్రను ఎంత మంది చేసినా కూడా జ్యోతిక లాగా మెప్పించలేకపోయారు. అంతెందుకు నాగవల్లి సినిమాలు అనుష్క సైతం చంద్రముఖి గా నటించింది. అయినప్పటికీ చంద్రముఖి అనగానే జ్యోతిక అనే అందరికీ గుర్తుకు వస్తుంది..

పెద్దపెద్ద కళ్ళు ఆ హావాభావాలతో జ్యోతిక నిజంగానే చంద్రముఖి ఏమో అనే భావన తప్పించింది. దీంతో ఇప్పటికీ అభిమానులు జ్యోతికలోని చంద్రముఖిని చూసుకుంటూ ఉంటారు. అయితే తాజాగా ఇప్పుడు చంద్రముఖిగా కంగనా కొత్త అవతారంలో కనిపించబోతుంది. దాదాపు 10 ఏళ్ల తర్వాత చంద్రముఖి సినిమాకి సీక్వల్ గా చంద్రముఖి టౌన్ తీస్తున్నారు. కాగా ఈ సినిమాలో రజనీకాంత్ పాత్రను రాఘవ లారెన్స్ పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు సాంగ్ ప్రోమో ప్రేక్షకులను ఒక స్థాయిలో ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈసారి

చంద్రముఖి 2 లో కంగనా ప్రధాన ఆకర్షణగా మారబోతోంది. అయితే ఇప్పటివరకు కాంట్రవర్సీ క్వీన్ గా పేరు తెచ్చుకున్న ఈమె వివాదాలే కాకుండా పాత్రల విషయంలో కూడా చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తూ ఉంటుంది. అయితే ఈసారి చంద్రముఖి క్యారెక్టర్ కూడా ఆమెకు చాలెంజింగ్ రోల్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. పౌరాణిక పాత్రలు ఆమె చేయడం కొత్తేమీ కాదు. అలాంటి పాత్రలు ఇంతకుముందు ఎన్ని చేసినప్పటికీ చంద్రముఖి సినిమాలో ఒక ఎమోషన్ ఉంటుంది. ప్రేమాపక రెండు చూపించే పాత్రలో జ్యోతిక మైమరిపించింది .ఇప్పుడు అదే పాత్రలో కంగనా ఎలా నటిస్తుందా అనే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: