మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో ఆ స్టార్ హీరోయిన్ తో ఐటెం సాంగ్..!?

Anilkumar
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆ మధ్య వరుసగా హిట్ సినిమాలు అందుకున్నప్పటికీ గత కొంతకాలంగా ఆయన చేస్తున్న సినిమాలన్నీ కూడా ప్లాప్ లు అవడంతో నిరాశ పడ్డాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. దీంతో ఈసారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలి అని గట్టి నిర్ణయం తీసుకున్నాడు మహేష్ బాబు. ఇందులో భాగంగానే ఒక బడా సినిమాలో నటిస్తున్నాడు. అయితే రాజుగా ఇప్పుడు మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు. ఫుల్ లెన్త్ మాస్ యాక్షన్ గుంటూరు సినిమాపై ఇప్పటికే ఊహించని రేంజ్ లో అంచనాలు పెరిగిపోయాయి.

ఇక అందుకు ఏమాత్రం తీసుకుపోని విధంగా ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు దర్శక నిర్మాతలు. కాగా ఈ సినిమా షూటింగ్ విషయంలో కొన్ని బ్రేకులు గందరగోళాలు వస్తున్నప్పటికీ ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన యాభై శాతం వరకు షూటింగ్ పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ సినిమాని పక్కన పెట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ఆయన వచ్చిన తర్వాత ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్లో మళ్లీ ప్రారంభం చేస్తారట. అయితే అప్పటినుండి ఏ మాత్రం బ్రేకులు లేకుండా ఈ సినిమాని పూర్తిచేసేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

 ఇక దాదాపు పుష్కరకాలం తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కాలం సినిమా వస్తుంది. దీంతో ఈ సినిమాలో ఒక అదిరిపోయే ఐటమ్ సాంగ్ కూడా ఉండబోతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే చాలామంది బడా హీరోయిన్ల నుండి చిన్న హీరోయిన్ల వరకు అందరి పేర్లను పరిశీలించారట. కానీ ఇప్పటివరకు ఆ విషయంలో ఎటువంటి క్లారిటీ అయితే రాలేదు. కానీ తాజాగానితన సమాచారం మేరకు ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియార అద్వానీ ఒక ఐటమ్ సాంగ్ ఉండబోతుందని అంటున్నారు. ఇప్పటికే ఆమెతో దీనికోసం డేట్స్ కూడా కేటాయించినట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబు అందుబాటులో ఉండే దాన్నిబట్టి ఈ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారట. ఇదిలా ఉంటే ఇక గతంలో ఆమె అతడితో కలిసి భరత్ అనే నేను సినిమాలో నటించిన సంగతి తెలిసిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: