చిరంజీవి ఇంట్లో షూటింగ్ చేసిన టాలీవుడ్ సినిమాలు.. ఏవో తెలుసా..!?

Anilkumar
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక మెగాస్టార్ చిరంజీవికి అప్పట్లో చెన్నైలో ఒక హనీ హౌస్ అని గెస్ట్ హౌస్ ఉండేది. చెన్నైలో ఉన్నన్ని రోజులు చిరంజీవికి ఆయన కుటుంబానికి సంబంధించిన ఫంక్షన్లు అన్నీ కూడా ఆ గెస్ట్ హౌస్ లోనే జరిగేవి. దాంతోపాటు చిరంజీవి పుట్టినరోజు వేడుకలు సైతం అందులోనే జరిగేవి. అయితే ఎప్పుడైతే ఆయన హైదరాబాద్ కి కుటుంబం మొత్తాన్ని షిఫ్ట్ చేశారో అప్పటినుండి ఆ గెస్ట్ హౌస్ ని వాడడం లేదు. ఎప్పుడైనా పని మీద చెన్నైకి వెళ్ళినప్పుడు ఆ ఇంటి వైపు ఒక లుక్కేయడమే కానీ

 ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం మానేశారు. ఇక చిరంజీవి హైదరాబాదుకి వచ్చేసిన తర్వాత ఇంటిని షూటింగ్స్ కి అద్దెకి ఇచ్చే వారిని తెలుస్తోందిమ్ అలా గడిచిన మూడు దశాబ్దాల నుండి ఆ ఇంట్లో ఎన్నో షూటింగ్స్ జరిగాయట. ఇక ఆ ఇంట్లో షూటింగ్స్ ని పూర్తి చేసుకున్న ప్రతి సినిమా కూడా మంచి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయని అంటూ ఉంటారు. అయితే అందులో ఎక్కువ హిట్స్ నందమూరి బాలకృష్ణ వే అని అంటున్నారు. ఇక బాలకృష్ణ సినిమాలు అంటే కచ్చితంగా ఫైట్ సన్నివేశాలు ఉండనే ఉంటాయి. కానీ ఎటువంటి ఫైటర్ సన్నివేశాలు

లేకుండా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్న ఏకైక బాలకృష్ణ సినిమా నారి నారి నడుమ మురారి. అయితే ఈ సినిమా అప్పట్లో రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే. అంతే కాదు అప్పట్లోనే 40 కేంద్రాలలో వంద రోజులను పూర్తి చేసుకుంది ఈ సినిమా . ఈ సినిమా మాత్రమే కాదు ఎన్టీఆర్ మేజర్ చంద్రకాంత్ హలో బ్రదర్ గొప్పింటి అల్లుడు సుస్వాగతం గోకులంలో సీత ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని సూపర్ హిట్ సినిమాలు మెగాస్టార్ చిరంజీవి ఈ ఇంట్లోనే జరిగాయట. అలా చిరంజీవి గెస్ట్ హౌస్  అప్పట్లో చాలా ఫేమస్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: