వింత వ్యాధితో బాధపడుతున్న శృతిహాసన్..!?

Anilkumar
విశ్వనటుడు కమలహాసన్ వారసురాలిగాసిని ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమయ్యింది శృతిహాసన్మ్ అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో హీరోయిన్గా పరిచయం అయ్యింది శృతిహాసన్. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులను అందుకున్న ఆమె దాని తరువాత వరుసగా సినిమాల్లో నటించే అవకాశాలను దక్కించుకుంది. దాని తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ నీ తన ఖాతాలో వేసుకుంది శృతిహాసన్. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాలు అవకాశాలను అందుకొని తెలుగు తోపాటు తమిళంలో కూడా సినిమాల్లో నటించింది. దాని తర్వాత హిందీలోనూ చాలా సినిమాల్లో నటించింది.

కానీ అక్కడ ఆశించిన స్థాయిలో సక్సెస్ను అందుకోలేకపోయింది. తిరిగి తెలుగులో ఒకానొక సమయంలో వరుస సినిమాలో నటించినప్పటికీ ఆ సినిమాలన్నీ కూడా ఫ్లాప్స్ అవుతూ వచ్చాయి. దాని తర్వాత రవితేజ నటించిన క్రాక్ సినిమాతో మరొక సాలిడ్ హిట్ తన ఖాతాలో వేసుకుని కమ్ బాక్ ఇచింది శృతిహాసన్. ఇదిలా ఉంటే ఇక శృతిహాసన్ కి ఒక వింత వ్యాధి ఉంది అన్న వార్తలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఇక శృతిహాసన్ కేవలం నటిగానే కాకుండా సింగర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. పలు పాటలను కూడా పాడింది. దాంతో పాటు పలు ప్రైవేట్ సాంగ్ కూడా చేసింది. ఈ క్రమంలోనే వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియా ద్వారా  అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉండే శృతిహాసన్ నిరంతరం తన రకరకాల ఫోటోలను తన మ్యూజిక్ వీడియోలను పంచుకుంటూ ఉంటుంది. దాంతోపాటు తన బాయ్ ఫ్రెండ్ కి సంబంధించిన ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటుంది శృతిహాసన్. ఇక ఇదిలా ఉంటే ఇక శృతిహాసన్ ఒక వింత వ్యాధితో బాధపడుతుంది అన్న వార్తలు బయటకు వచ్చాయి. తాను ఒత్తిడికి ఎక్కువగా గురైతే ఊహించిన విధంగా మారిపోతుంది.. ఎక్కువ స్ట్రెన్ అయితే ఎక్కువగా ఆమెకి కోపం వస్తుంది..   విపరీతమైన ఆవేశానికి లోనవుతుందిట.. ఇక ఆ సమయంలోనే చిన్న విషయాన్ని కూడా విపరీతంగా కోపం తెచ్చుకుంటుంది.. కోపం తగ్గాక ఎందుకు ఇలా చేశాను అని బాధపడుతుందట..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: