డేవిల్ సినిమా రిలీజ్ డేట్ లాక్..!!

Divya
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఇటీవలే ఆమిగోష్ అనే చిత్రంలో నటించి పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. కానీ బింబిసారా చిత్రంతో మంచి పాపులారిటీ సంపాదించారు .ప్రస్తుతం కళ్యాణ్ రామ్ చేతిలో డెవిల్ అనే ఒక పాన్ ఇండియా చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్గా సంయుక్త మీనన్ నటిస్తోంది. నవీన్ అనే ఒక కొత్త డైరెక్టర్ అభిషేక్ నాయ నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ప్రస్తుతం డెవిల్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నది. ఇటీవల కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి గ్లింప్స్ రిలీజ్ చేయడం జరిగింది.

ఈ సినిమా బ్రిటిష్ కాలంలో ఉండే సీక్రెట్ ఏజెంట్స్ కథ అంశంతో తెరకెక్కిస్తూ ఉన్నట్లుగా తెలుస్తోంది. స్వాతంత్రం ముందు పిరియాడిక్ కథ తో రాబోతున్న సినిమా కావడంతో ఈ చిత్రం పైన భారీ గాని అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అంటూ ఎదురు చూస్తున్న అభిమానులకు తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించడం జరిగింది చిత్ర బృందం. కళ్యాణ్ రామ్ డెవిల్ ఈ ఏడాది నవంబర్ 24న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

డేవెల్ డీ కోడింగ్ అంటూ ఒక పోస్టర్ని రివిల్ చేస్తూ చిత్ర బృందం డెవిల్ సినిమా రిలీజ్ డేట్ అని కూడా అనౌన్స్మెంట్ చేశారు. దీంతో నందమూరి అభిమానుల సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక ట్విట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రంతో ఏ మేరకు అభిమానులను మెప్పిస్తారు చూడాలి మరి. ఇక ఎన్టీఆర్ నటిస్తున్న దేవరా సినిమాకి కూడా నిర్మాతగా కళ్యాణ్ రామ్ వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. దేవర సినిమా వచ్చే ఏడాది ఆగస్టు నెలలో విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: