ఆ హీరోయిన్ ను చూసి గర్వపడుతున్న సాయి ధరమ్ తేజ్...!!

murali krishna
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం వరస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన తాజాగా బ్రో  సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇక ఈ సినిమా మిశ్రమ ఫలితాలను అందుకుంది. సినిమాల పరంగా బిజీగా ఉండి సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఇలా సోషల్ మీడియా వేదికగా ఈయన చేసే పోస్టులు వైరల్ అవుతూ ఉంటాయి.ఈ క్రమంలోనే సాయి ధరమ్ తేజ్ తన మొదటి హీరోయిన్ గురించి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.సాయి ధరమ్ తేజ్ మొదటగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం రేయ్. ఈ సినిమాలో ఈయన నటి సయామీ ఖేర్‌ తో కలిసి నటించారు.


అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకాదరణ సంపాదించుకోలేకపోయింది. ఇకపోతే తాజాగా నటి సయామీ నటించిన ఘూమర్‌  ట్రైలర్‌ను షేర్‌ చేసిన ఈయన నటిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ స్పందిస్తూ.. నిన్ను చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది.మన మొదటి సినిమా రేయ్'  నుంచి ఈ ప్రత్యేకమైన సినిమా 'ఘూమర్‌' వరకూ నీ ప్రయాణం అద్భుతంగా సాగింది. నీ ఓపిక, లక్ష్యానికి ఇది నిదర్శనం.

కెరియర్ పరంగా నీవు మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. నేను ఎంతటి ఆనందాన్ని అయితే పొందుతున్నానో నీ కుటుంబం కూడా అలాగే గర్వపడాలని ఆశిస్తున్నాను అంటూ సాయి ధరంతేజ్ తన మొదటి సినిమా హీరోయిన్ గురించి ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె పలు తెలుగు సినిమాలలో నటించిన అనంతరం బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.తాజాగా ఈమె నటించిన ఘూమర్‌ క్రీడా నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈసినిమాలో అభిషేక్‌ బచ్చన్‌  కీలకపాత్ర పోషించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: