పాపం.. అందరి ముందే బేబీ హీరోయిన్ పరువు పోయిందిగా?

praveen
యూట్యూబర్ గా కెరియర్ స్టార్ట్ చేసి వెండితెరపై అడపదడప అవకాశాలు అందుకుని గుర్తింపును సంపాదించుకున్న వైష్ణవి చైతన్య ఇటీవలే ఒక్కసారిగా ఇండస్ట్రీలో హీరోయిన్గా అందరికీ పరిచయమైంది అన్న విషయం తెలిసిందే. సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బేబీ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఇక ఈ సినిమాలో అద్భుతమైన పాత్రను దక్కించుకున్న వైష్ణవి చైతన్య ఇక తన నటనతో కూడా ప్రేక్షకులను మెప్పించింది అని చెప్పాలి. ఇక ఈ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


 ఏకంగా మొదటి సినిమాలోనే హీరోయిన్గా బోల్డ్ పాత్రలో నటించేందుకు ఒప్పుకొని రిస్క్ చేసింది వైష్ణవి చైతన్య. ఇక ఆమె పడిన కష్టానికి చివరికి ప్రతిఫలం దక్కింది అని చెప్పాలి. ఇక ఈ సినిమా 70 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. కాగా ఇటీవల ఈ సినిమా సక్సెస్ నేపథ్యంలో మెగా సెలబ్రేషన్స్ పేరుతో ఒక ఈవెంట్ ఏర్పాటు చేశారు. అయితే ఈ ఈవెంట్లో వైష్ణవి చైతన్య తన పరువు మొత్తం పోగొట్టుకుంది. ఆనంద్ దేవరకొండ అభిమాని అయిన ఒక కుర్రాడు మాట్లాడుతూ.. బేబీ సినిమాలో వీరాజ్ చేసిన పాత్ర నాకు బాగా కనెక్ట్ అయింది. నా జీవితంలో  కూడా అచ్చం ఇలాగే జరిగింది.


 అమ్మాయిలు ఎందుకు మోసం చేస్తారో అస్సలు అర్థం కావట్లేదు అంటూ ఆ కుర్రాడు కామెంట్ చేసాడు. ఇదే ఈవెంట్లో ఉన్న విరాజ్ అశ్విన్ ఒక్కసారిగా గట్టిగా నవ్వడంతో అక్కడున్న వారు షాక్ అయ్యారు. ఇక ఆ తర్వాత వైష్ణవి చైతన్య గురించి మాట్లాడిన ఆ కుర్రాడు.. మేడం మిమ్మల్ని చూసి మా లవర్ గుర్తొస్తుంది. నాకు సెకండ్ లవర్ టెన్త్ ఒకటి.. ఇంటర్లో మరొక లవ్ స్టోరీ ఉంది. నాకు రెండు లవ్వులు ఉన్నాయి. మీరు మోసం చేసినట్లే నా పోరి కూడా నన్ను మోసం చేసింది అని చెప్పగానే హీరోయిన్ ఫేస్ మొత్తం ఒక్కసారిగా మాడిపోయింది. ఆమె ఎక్స్ప్రెషన్ చూస్తే నా పరువు తీయకు అన్నట్లుగా పెట్టింది అని అందరికీ అర్థమైంది. వెంటనే యాంకర్ స్పందించి అది మూవీలో ఒక క్యారెక్టర్ మాత్రమే రియల్ లైఫ్ కాదు అంటూ కామెంట్  చేసింది. ఇది కాస్త ఇప్పుడు వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: