ఆ విషయంలో మంచు మనోజ్ తో బ్రో నిర్మాతల ప్లాన్..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ఎంతటి ప్రత్యేకత ఉందో మనందరికీ తెలిసిందే. అలా మంచు మనోజ్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. కానీ పర్సనల్ లైఫ్ తో మంచు మనోజ్ మీడియాలో సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా వైరల్ అవుతారు. ఇక ఆ మధ్య మంచు మనోజ్ భూమా మౌనికని రెండవ వివాహం చేసుకున్నాడు. ఇక ఆయన హీరోగా వెండితెరపై కనిపించి దాదాపుగా ఐదేళ్లకు పైగానే అవుతుంది. బ్రహ్మస్మి వాట్ ది ఫిష్ వంటి సినిమాలను లైన్లో పెట్టాడు. అయితే ఈ సినిమాలో ఎప్పుడో వస్తాయి అన్న విషయంపై ఇప్పటివరకు క్లారిటీ లేదు.

కానీ  మనోజ్ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.తాజాగా అందుతున్న సమాచారం మేరకు మంచు మనోజ్ త్వరలోనే ఒక టాప్ షో కి హోస్టుగా వ్యవహరించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఓటీటీ లో ఆ షో రాబోతున్నట్లుగా తెలుస్తోంది. అలా మంచి రెస్పాన్స్ ఉంటుంది. బాలకృష్ణ సమంతా రానా దగ్గుబాటి లాంటి స్టార్ హీరో హీరోయిన్లు ఇప్పటికే అలా ఓటిటి వేదికలపై హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు మంచు మనోజ్ సైతం వారి బాటలోనే నడవబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే

మంచు మనోజ్ హోస్ట్ గా చేసే టాక్  షోని బ్రో చిత్ర నిర్మాత నిర్మించబోతున్నట్లుగా తెలుస్తోంది. నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టాక్ షో కోసం ప్లాన్ స్టార్ట్ చేసినట్లుగా అంటున్నారు. అయితే ప్రస్తుతం ఆ ఓటీటి వేదికపై ఈ టాక్ షో మీ స్ట్రీమింగ్ చేసే ప్లాన్ లో ఉన్నారట. త్వరలోనే దీన్ని షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తారట. దీనికి టైటిల్ ఏంటి ఇతర వివరాలు అన్నది త్వరలోనే బయటకు వస్తాయి. ఇదిలా ఉంటే ఇక మంచు మనోజ్ రెండో వివాహంతో ఇటీవల కొత్త జీవితాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. మౌనికతో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న మనోజ్ వివాహ బంధం తో ఒకటయ్యారు. ఇక తన సోదరీ మంచు లక్ష్మి నివాసంలో వీరిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: