అతిలోక సుందరి దిగువంత హీరోయిన్ శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది జాన్వి కపూర్. ధడక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే నటన పరంగా మంచి మార్కులను కొట్టేసింది. ఇండస్ట్రీలో విభిన్న కథాంశం చిత్రాలను ఎంచుకొంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. గ్లామర్ పాత్రలే కాకుండా కంటెంట్ ప్రాధాన్యత మరియు లేడీ ఓరియంటెడ్ సినిమాలను చేస్తూ దూసుకుపోతోంది జాన్వి. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవరాసనంలో హీరోయిన్గా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ సినిమాతోనే తెలుగులోకి
హీరోయిన్గా పరిచయం అవ్వబోతుంది. ఇక చాలా సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ పై తనకున్న అభిమానాన్ని బయటపెట్టింది ఈమె. తాజాగా మరోసారి దేవర సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ఎన్టీఆర్ తో కలిసి నటించాలని చాలాకాలం ఎదురు చూశాను అని.. ఈ సినిమా ప్రకటించిన తర్వాత ఆమెని హీరోయిన్గా తీసుకుంటే బాగుంటుంది అని.. అనుకున్నానని ఏడాదిపాటు ఇదే విషయాన్ని కోరుకుంటూ వచ్చాను అని... చివరకు తన కోరిక నెరవేరింది అని ఈ సందర్భంగా పేర్కొంది జాన్వి కపూర్. అయితే తాజాగా ఇప్పుడు ఎన్టీఆర్ తో కలిసి షూటింగ్లో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది అని.
తన సంతోషాన్ని వ్యక్తపరిచింది. దానితోపాటు తనకు మరియు రన్వీర్ సింగ్ టైగర్ డ్రాఫ్లతో కలిసి నటించాలని ఉందని.. ఈ సందర్భంగా తన మనసులోని కోరికను బయటపెట్టింది జాన్వి కపూర్. అంతే కాకుండా సంజయ్ లీల బంచాలి కరణ్ జోహార్ సినిమాల్లో నటించాలని ఉంది అని.. తన మనసులోని కోరికను ఈ సందర్భంగా వెల్లడించింది. ఇదిలా ఉంటే ఇక ప్రస్తుతం దేవరా సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న జాన్వికపూర్ దేవర సినిమా పై భారీ అంచనాలను పెట్టుకుంది. ఇక ఈ సినిమాతో ఆమె తెలుగు ఎంట్రీ ఇవ్వడంతో అటు అతిలోక సుందరి శ్రీదేవి మరియు జాన్వి కపూర్ ఫ్యాన్సీ ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. కాగా జూనియర్ ఎన్టీఆర్ మరియు జాన్వీ కపూర్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది..!!