స్టార్ హీరో ధనుష్ తో జత కట్టబోతున్న 'బుట్టబొమ్మ' నటి...!!

murali krishna
అనిఖా సురేంద్రన్సి నీ పరిశ్రమలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి ఇప్పుడు ఏకంగా స్టార్ హీరో ధనుష్ సినిమాలో లీడ్ రోల్ చేసే స్థాయికి ఎదిగిపోయింది.అసలు ఎవరు ఈ అనిఖా....ఈమె బాక్గ్రౌండ్ ఏంటి? ఇంత తక్కువ సమయంలో ఇంత సక్సెస్ఫుల్ ఎలా అయ్యింది? ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.అనిఖా కేరళలోని మంజేరా అనే ఊరిలో 2004 , నవంబర్ 28న సురేందర్ త్రిచూర్ ముత్తువర, రజిత సురేందర్ అనే దంపతులకు జన్మించింది. ఈమె తండ్రి ఒక మోడల్ కోఆర్డినేటర్.ఈమెకు ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. 2007లో కేవలం మూడేళ్ళ వయసులో "చోట బొంబాయి" అనే కన్నడ చిత్రంతో తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టింది అనిఖా. కానీ ఈ చిత్రం క్రెడిట్స్ లో ఆమె పేరు ఉండదు. ఆమెకు గుర్తింపు తెచ్చిన చిత్రం మాత్రం 2010లో విడుదలైన మలయాళీ చిత్రం "కథ తుదురున్ను".

కథ తుదురున్నుతరువాత ఆరు మలయాళీ చిత్రాలలో నటించిన అనిఖా, "ఎన్నై అరిందాల్" చిత్రంతో తమిళ సినిమాలోకి అడుగు పెట్టింది. ఈ చిత్రం "ఎంతవాడుగాని" గా తెలుగులో డబ్ చేయబడింది.ఈ చిత్రానికి గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించగా, అజిత్, త్రిష, అనుష్క వంటి స్టార్స్ తో నటించే అవకాశం కొట్టేసింది అనిఖా. ఈ చిత్రంతో తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో కూడా పాపులర్ అయింది. తరువాత నేను రౌడీనే, విశ్వాసం, ఘోస్ట్ వంటి చిత్రాలలో నటించి తెలుగు, తమిళ ప్రేక్షకులకు దగ్గరయింది.అనిఖాకు మొదట హీరోయిన్ గా బ్రేక్ ఇచ్చింది టాలీవుడ్. ఈ ఏడాది రిలీజ్ అయిన "బుట్ట బొమ్మ" చిత్రంలో అనిఖా హీరోయిన్.

ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మించారు. ఇది ఒక రొమాంటిక్ ఆక్షన్ థ్రిల్లర్. ఈ చిత్రం "కప్పేలా" అనే మలయాళీ చిత్రం రీమేక్. ఈ సినిమాలో అనిఖా తన నటన తో అందర్నీ మెప్పించింది.ఈ ఏడాదే మలయాళం లో కూడా "ఓహ్ మై డార్లింగ్" అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా డెబ్యూ చేసింది ఈ అమ్మాయి. దుల్కర్ సల్మాన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ "కింగ్ అఫ్ కొత్త"లో కూడా ఈమె నటిస్తోందని సమాచారం. ఇప్పుడు తాజాగా ఈ ముద్దుగుమ్మ ఏకంగా ధనుష్ తో యాక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసిందనే వార్త వైరల్ అవుతోంది. ప్రస్తుతం "కెప్టెన్ మిల్లర్" చిత్రం తో బిజీగా ఉన్న ధనుష్, తర్వాత తన సొంత డైరెక్షన్లో ఒక సినిమా చేయబోతున్నాడట. ఈ చిత్రంలో అనిఖా లీడ్ రోల్ చేయబోతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే గనక నిజం ఐతే ఈమె పంట పండినట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: