"ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్" ఫస్ట్ సింగల్ విడుదలకు సంబంధించిన క్రేజీ న్యూస్..!

Pulgam Srinivas
నితిన్ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా వక్కంతం వంశీ దర్శకత్వంలో ప్రస్తుతం "ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్" అనే మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. కాకపోతే ఈ మూవీ బృందం మాత్రం ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను కొన్ని రోజుల క్రితమే అనౌన్స్ చేసింది. ఇన్ని రోజుల పాటు ఈ సినిమా టైటిల్ లేకుండానే షూటింగ్ ను పూర్తి చేస్తూ వచ్చింది. ఇకపోతే ఈ సినిమా టైటిల్ ను ప్రకటిస్తూనే ఈ మూవీ మేకర్స్ ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 23 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.


ఇక ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి మొదటి సాంగ్ ను మొదట అక్టోబర్  2 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాలోని మొదటి సాంగ్ అయినటువంటి "డేంజర్ పిల్ల" అంటూ సాగే సాంగ్ ను ఈ రోజు అనగా ఆగస్టు 2 వ తేదీన సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇకపోతే ఈ సినిమాకు హరిజ్ జయరాజ్ సంగీతం అందిస్తున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత హారిజ్ స్టేట్ తెలుగు మూవీ కి సంగీతం అందిస్తూ ఉండడంతో ఈ మూవీ ఆల్బమ్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.


మరి ఈ మూవీ ఆల్బమ్ ప్రేక్షకులకు ఏ మేరకు అల్లరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ఇకపోతే ఆఖరుగా నితిన్ "మాచర్ల నియోజకవర్గం" సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరాశపరిచింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ దర్శకుడు వక్కంతం వంశీ ఆఖరుగా "నా పేరు సూర్య" సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించింది. ఇకపోతే వక్కంత వంశీ ఈ సినిమాను సరికొత్త స్టోరీ లైన్ తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: