గోపీచంద్ సినిమా పరిస్థితి ఇలా ఉంది ఏంటి..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక అద్భుతమైన మాస్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్న నటులలో ఒకరు అయినటువంటి గోపీచంద్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన మొదట హీరోగా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ విలన్ గా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. అలా ప్రతి నాయకుడి పాత్రలతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న గోపీచంద్ ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో హీరోగా నటిస్తూ వచ్చాడు.


అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న గోపీచంద్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ఉన్న మాస్ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఆఖరుగా గోపీచంద్ ... శ్రీ వాసు దర్శకత్వంలో రూపొందిన రామబాణం అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటించగా మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. జగపతి బాబు ... కుష్బూ ఈ మూవీ లో కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. కాకపోతే ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజే నెగటివ్ టాక్ ను తెచ్చుకోవడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ ఫ్లాప్ గా మిగిలింది.


ఇకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకోవడంతో చాలా తక్కువ రోజుల్లోనే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ అనేక వార్తలు అప్పట్లో వచ్చాయి. కాకపోతే ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతున్న ఈ మూవీ ఏ డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఇప్పటి వరకు ఎంట్రీ ఇవ్వలేదు. అలాగే ఈ మూవీ డిజిటల్ ఎంట్రీ కి సంబంధించిన ఎలాంటి అఫీషియల్ న్యూస్ కూడా ఇప్పటి వరకు వెలువడలేదు. మరి ఈ మూవీ ఏ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో  విడుదల అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: