క్రిస్మస్ రిలీజ్ కు రెడీ అయిన తెలుగు మూవీలు ఇవే..!

Pulgam Srinivas
ఈ సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా కొన్ని సినిమాలను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే కొన్ని మూవీ లకు సంబంధించిన మూవీ మేకర్స్ అధికారిక డేట్ లను అనౌన్స్ చేశారు. అలా ఈ సంవత్సరం క్రిస్మస్ కానుకగా విడుదల కాబోయే తెలుగు సినిమాలు ఏవో తెలుసుకుందాం.

హాయ్ నాన్న : నాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటి మృణాల్ ఠాకూర్ హీరోయిన్ నటిస్తూ ఉండగా ... ఈ సినిమాకు సౌర్యవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ 21 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

సైన్ధవ్ : విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను డిసెంబర్ 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు నిలకొని ఉన్నాయి.

హరోం హర : సుధీర్ బాబు హీరోగా రూపొందుతున్న ఈ సినిమాను డిసెంబర్ 22 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ : నితిన్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... వక్కంతం వంశీ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను డిసెంబర్ 23 వ తేదీన విడుదల చేనున్నట్లు ఈ మూవీ మేకర్స్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: