ట్రైలర్: దుమ్ము దులిపేస్తున్న భోళా శంకర్ ట్రైలర్..!!

Divya
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం భోళా శంకర్.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్ గా తమన్నా నటిస్తూ ఉండగా కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలి పాత్రలో కనిపించబోతోంది.అలాగే అక్కినేని యంగ్ హీరో సుశాంత్ కూడా ఇందులో కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాది అయితే తాజాగా ఈ సినిమా తెలియజేయడం జరిగింది చిత్ర బృందం.


ఈ సినిమా ట్రైలర్ ని రామ్ చరణ్ రిలీజ్ చేయడం జరిగింది తమిళంలో సూపర్ హిట్గా నిలిచిన వేదాలను చిత్రానికి రిమెక్కుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రంలో చిరంజీవి చాలా స్టైలిష్ గా కనిపించబోతున్నారు.. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. భోళా శంకర్ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది చిరంజీవి మరొకసారి తన స్వాగ్ యాక్షన్ సన్నివేశాలతో ఈ ట్రైలర్ ని అదరగొట్టేసారని చెప్పవచ్చు. చిరంజీవి చెప్పేటువంటి డైలాగులు కూడా అభిమానులకు పూనకాలు తెప్పించేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికి విడుదలైన సాంగ్స్ పోస్టర్స్ ఈ సినిమా అంచనాలను పెంచేశాయి.


ఆగస్టు 11వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతోంది వాల్తేరు వీరయ్య సినిమాతో ఈ ఏడాది మంచి విజయాన్ని అందుకున్న చిరంజీవి.. భోళా శంకర్ సినిమాతో మరో హిట్టు కొట్టడం ఖాయమని అభిమానులు భావిస్తూ ఉన్నారు ఈ మాస్ ఎంటర్టైన్మెంట్ చిత్రం ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.ముఖ్యంగా భారీ సినిమాలు కూడా ఆగస్టు నెలలో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భోళా శంకర్ సినిమా ట్రైలర్ మాత్రం వైరల్ గా మారుతోంది. ఇక ఈ సినిమా అయిపోయిన వెంటనే బింబిసారా డైరెక్టర్ తో చిరంజీవి సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఇటీవల సర్జరీ కోసం అమెరికాకు వెళ్లినట్టు తెలుస్తోంది చిరంజీవి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: