టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయినటువంటి నిఖిల్ తాజాగా స్పై అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నిఖిల్ సరసన మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించగా ... గర్రి బి హెచ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున పాన్ ఇండియా మూవీ గా విడుదల అయింది.
మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సెడ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లాంజ్ అందు కోలేక పోయింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాను ఈ రోజు నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ వారు తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో స్ట్రీమింగ్ చేస్తున్నారు.
ఎవరైనా ఈ సినిమాను థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ఈ సినిమా ఈ రోజు నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో తెలుగు , తమిళ , హిందీ , కన్నడ , మలయాళం భాషలో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి. మరి ఈ మూవీ కి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.