పాన్ ఇండియా చిత్రంలో ధనుష్.. రష్మిక.. నాగార్జున కూడా..?

Divya
తెలుగు ప్రేక్షకులకు డైరెక్టర్ శేఖర్ కమ్ముల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. తెలుగులో హ్యాపీ డేస్, లీడర్ ,ఫిదా , లవ్ స్టోరీ వంటి చిత్రాలను తెరకెక్కించి మంచి పాపులారిటీ సంపాదించారు. తాజాగా శేఖర్ కమ్ముల సంబంధించి ఒక విషయం వైరల్ గా మారుతోంది.ఇటీవలే కోలీవుడ్ హీరో ధనుష్ తో కలిసి ఒక సినిమాని మొదలుపెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ధనుష్ కూడా ఇటీవల సార్ సినిమాతో స్ట్రైట్ గా తెలుగులో నటించి మంచి విజయాన్ని అందుకున్నారు.


అయితే శేఖర్ కమ్ముల తో ధనుష్ నటించిన బోతున్న చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో ఉండబోతున్నట్లు సమాచారం. అయితే ఇందులో టాలీవుడ్ హీరో కూడా కీలకమైన పాత్రలు నటించ బోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అసలు విషయంలోకి వెళ్తే స్క్రిప్ట్ కోసం మాత్రమే డైరెక్టర్ శేఖర్ కమ్ముల దాదాపుగా రెండు సంవత్సరాల పాటు పని చేసినట్లుగా తెలుస్తోంది.ఈ చిత్రంలో నాగార్జున ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కూడా మ్యూజిక్ అందించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి మొత్తానికి ఇప్పటివరకు మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలోని తెరకెక్కించిన శేఖర్ కమ్ముల మొదటిసారి ఇలాంటి పాన్ ఇండియా సినిమాని తెరకెక్కిస్తూ ఉండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.


అయితే ఇందులో ధనుష్ సరసన హీరోయిన్ రష్మి కానీ ఎంపిక చేయబోతున్నట్లు తెలుస్తోంది.అందుకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నట్లు సమాచారం. రష్మిక ప్రస్తుతం బాలీవుడ్లో రణబీర్ కపూర్ తో కలిసి యానిమల్ అనే చిత్రంలో నటిస్తోంది.ఈ సినిమాతో పాటు అల్లు అర్జున్తో పుష్ప-2 సినిమా షూటింగ్లో కూడా పాల్గొన్నా రష్మిక కు ధనుష్ నటించే అవకాశం రావడంతో ఆమె అభిమానులు కూడా కాస్త ఆనందాన్ని తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా కూడా పాన్ ఇండియా సినిమా కావడంతో ఈమె మరింత పాపాటి సంపాదిస్తుందని తెలియజేస్తున్నారు. మరి చిత్ర బృందం ఎలా క్లారిటీ ఇస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: