వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్న స్టార్ డైరెక్టర్ కూతురు.....!!

frame వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్న స్టార్ డైరెక్టర్ కూతురు.....!!

murali krishna
హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతల కుమారులు, కూతుళ్లు సినిమా ఇండస్ట్రీలోకి సులువుగా అడుగుపెడతారు. తల్లిదండ్రుల పేర్లు చెప్పుకుని సినిమా అవకాశాలు దక్కించుకుంటారు.పేరెంట్స్‌కు సినిమా ఇండస్ట్రీలో పరిచయాలు ఉంటాయి గనుక అలాంటి వారికి అవకాశాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. తల్లిదండ్రులకు ఉన్న స్టార్ డమ్ కారణంగా వారసుల సినిమాలను కూడా చూసేందుకు సినీ ప్రేక్షకులు ఆసక్తి చూపుతారు. అందుకే సినీ ఇండస్ట్రీలో ఎక్కువమంది వారసులు ఉంటారు.

కానీ కొంతమంది మాత్రం తల్లిదండ్రుల పేర్లు వాడుకోకుండా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సక్సెస్ అవుతారు. అలాంటి వారిలో అదితి శంకర్ ఉంటుందని చెప్పవచ్చు. స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అయిన అదితి శంకర్ తండ్రి పేరు చెప్పుకోకుండానే సినిమా ఇండస్ట్రీలో రాణిస్తోంది. వరుస ఆఫర్లు దక్కించుకుంటూ మంచి పేరు సంపాదించుకుంటోంది. సినిమాల్లో హీరోయిన్ గా కాకుండా తన పాటలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే తమిళంలో పలు సినిమాల్లో నటించిన అదితి శంకర్.. తెలుగులో గని సినిమాలో ఒక పాట పాడింది. అలాగే ఇటీవల శివకార్తికేయన్, మావీరన్ సినిమా సినిమాల్లో అదితి నటించింది.

కానీ ఈ సినిమా విడుదలలో కాస్త జాప్యం జరగడం వల్ల ఓపెనింగ్ తెలుగులో సరిగ్గా రాలేదు. కానీ మావీరన్ సినిమా తమిళంలో కాస్త ఫరవాలేదనిపించింది. అయితే లేటెస్ట్ గా మరో సినిమాకు అదితి శంకర్ ఓకే చెప్పింది.విష్ణువర్ధన్ డైరెక్షన్‌లో వస్తున్న సినిమాలో అధర్వ మురళి తమ్ముడు ఆకాష్ మురళితో అదితి జత కట్టనుంది. పవన్ కల్యాణ్‌తో పంజా సినిమా తీసిన విష్ణువర్దన్ డైరెక్షన్ లో అదితి నటించనుంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవల చెన్నైలో ప్రారంభమవ్వగా.. ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయింది.

ఇక సెకండ్ షెడ్యూల్ షూటింగ్ పోర్చుగల్, లిస్బన్‌లోనూ జరగనుంది. రొమాంటిక్ జోనర్‌గా ఈ సినిమాను విష్ణువర్దన్ తెరకెక్కిస్తున్నాడు. విష్ణువర్దన్ దర్శకత్వంలో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని అదితి శంకర్ చెబుతోంది. అలాగే ఆకాష్ మురళితో కలిసి నటిస్తుంటే హ్యాపీగా ఉంటుందని, కొత్త వారితో నటించినప్పుడే ప్రెష్ టాలెంట్ బయటకు వస్తుందని చెబుతోంది. అయితే విష్ణువర్దన్ రెడ్డి అజిత్ తో సినిమా చేయాల్సి ఉంది. కానీ అది క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: