మెగాస్టార్ చిరంజీవి కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏడుపదుల వయసులో దగ్గరగా ఉన్నప్పటికీ అదే ఎనర్జీతో యంగ్ హీరోలకి ఏమాత్రం తగ్గకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ వయసులో కూడా కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నాడు. ఒకవైపు సినిమాలు చేస్తూనే కుదిరినప్పుడల్లా తన భార్య సురేఖతో కలిసి వెకేషన్ కి వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఇటీవల చిరంజీవి తన భార్యతో కలిసి వెకేషన్ కి వెళ్ళిన సంగతి తెలిసిందే. ఫ్లైట్లో తన భార్య సురేఖతో దిగిన ఫోటోలను మెగాస్టార్ చిరంజీవి
సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం జరిగింది. ఇక ఆయన షేర్ చేసిన ఫోటోలలో చాలా నవ్వుతూ సంతోషంగా కనిపించాడు చిరంజీవి. దాంతో ఏదైనా వెకేషన్ కి వెళ్తున్నారేమో అని అందరూ అనుకున్నారు.ఈ నేపథ్యంలోనే చిరంజీవి వెకేషన్ కి ఎంజాయ్ చేయడానికి వెళుతున్నాడని అందరూ అనుకున్నారు. కానీ చిరంజీవి వెకేషన్ కి వెళ్లలేదట. ఒక సర్జరీ కోసం చిరంజీవి అమెరికా వెళ్లినట్లుగా తెలుస్తోంది. తాజాగా అసలు విషయం బయటపడింది దాంతో చిరంజీవి ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు. చాలాకాలం గా కాలినొప్పితో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది.
దానికి సర్జరీ చేయించుకోవడం కోసమే చిరంజీవి ఆయన భార్య సురేఖ ఇద్దరు అమెరికా వెళ్లారట. ఇక అదేమంత పెద్ద నొప్పి కాదని చాలా చిన్న సమస్య అని అంటున్నారు. అయితే ఆయన సర్జరీ పూర్తి చేసుకుని ఇటీవల హైదరాబాద్ కి తిరిగి వచ్చేసారు ఈ దంపతులు. పైగా ఎయిర్పోర్ట్లో హ్యాపీగా నడుచుకుంటూ వెళ్లారు. కాబట్టి చిరంజీవికి ఎటువంటి సమస్య లేదని చెబుతున్నారు ఆయన సన్నిహితులు. ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ఆయన ఇటీవల నటించిన భోళాశంకర్ సినిమా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆగస్టు 11న విడుదల కి సిద్ధంగా ఉంది. జులై 25న ఈ సినిమా ట్రైలర్ విడుదల చేస్తామని ఇప్పటికె ప్రకటించారు చిత్ర బృందం..!!