హాలీవుడ్ సినిమాలకు పోటీ ఇస్తున్న బేబీ?

Purushottham Vinay
హృదయ కాలేయం, కొబ్బరిమట్ట లాంటి పేరడీ సినిమాలు చేసిన చిన్న డైరెక్టర్ సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన లో బడ్జెట్ చిన్న సినిమా బేబీ బాక్సాఫీస్ వద్ద పెద్ద పెద్ద హాలీవుడ్ సినిమాలు పోటీగా ఉన్నా కూడా ఎక్కడ తగ్గకుండా సంచలనం సృష్టిస్తోంది.ఈ మూవీలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇక వర్షం ఒక పక్క దుమ్ము రేపుతున్నా అసలు దానితో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆగకుండా సంచలనం కొనసాగిస్తోంది. మొదటి వారం రోజులలో ఈ మూవీ అద్భుతమైన బుకింగ్స్‌తో సంచలన వసూళ్లు సాధిస్తూ చాలా స్పీడ్ గా దూసుకుపోతోంది.నైజాంలో ఈ సినిమా ఇప్పటిదాకా 12 కోట్ల పైగా వసూళ్లు సాధించింది.ఇక ఈ సినిమా దాదాపు 11 రోజుల్లోనే ఏకంగా 70 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆనంద్ దేవరకొండ అన్న విజయ్ దేవరకొండ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అయిన అర్జున్ రెడ్డి లైఫ్‌టైమ్ కలెక్షన్స్ ని క్రాస్ చేసింది. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే బేబీ మూవీ తెలుగు సినిమా చరిత్రలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.మొన్న శుక్రవారం నాడు పెద్ద పెద్ద  సినిమాలు రిలీజ్ అయినా సరే ఈ సినిమానే ప్రేక్షకులకు బెస్ట్ ఆప్షన్ గా మారింది.  



ఈ సినిమా ఇప్పటికే ఆనంద్ దేవరకొండ, సాయి రాజేష్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. కేవలం కలెక్షన్స్ మాత్రమే కాదు, అగ్ర నిర్మాతలు, నటీనటులు అలాగే క్రిటిక్స్ నుండి కూడా ఈ సినిమా ఎన్నో ప్రశంసలను అందుకుంటుంది.. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మాస్ మూవీ మేకర్స్ పతాకంపై డైరెక్టర్ మారుతి, ఎస్కేఎన్ ఈ సినిమాని నిర్మించారు. ఇక మొత్తం మీద అన్న అర్జున్ రెడ్డి సినిమా ఓవరాల్ కలెక్షన్స్ ను బేబీ మూవీ కేవలం 11 రోజుల్లోనే ఈజీగా క్రాస్ చేయడంతో ఆనంద్ దేవరకొండ  ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో నటీనటులకు ఖచ్చితంగా ఇతర సినిమా అవకాశాలు కూడా లభిస్తున్నాయి.ఈ సినిమాతో మెయిన్ హీరో ఆనంద్ యాక్టింగ్ పరంగా ప్రశంసలు అందుకుంటే అతని కంటే విరాజ్  యూత్ లో చాలా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఎందుకంటే అతని స్క్రీన్ ప్రెజెన్స్ యూత్ కి బాగా నచ్చింది. ఇంకొక్క గట్టి హిట్టు పడితే ఖచ్చితంగా స్టార్ హీరో అవుతాడు విరాజ్.కానీ ఈ సినిమా వల్ల వైష్ణవి మాత్రం ఒక వర్గం నుంచి విపరీతంగా నెగటివిటీని ఫేస్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: