మగధీర సినిమా రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..!?

Anilkumar
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న సినిమాల్లో మగధీర సినిమా కూడా ఒకటి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కాజల్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో హీరోయిన్లుగా నటించారు. కాగా ఈ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయని అందుకుందో మనందరికీ తెలిసిందే. దాంతోపాటు 2009లో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. దాదాపు 40 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా అప్పట్లోనే 80 కోట్లకు పైగానే కలెక్షన్స్ అందుకొని రికార్డ్స్ క్రియేట్ చేసింది. అయితే రామ్ చరణ్ సినీ ప్రయాణంలో మగధీర సినిమా ఒక మైలురాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.


ఇక ఈ సినిమాలో దిగవంత నటుడు శ్రీహరి శరత్ బాబు రావు రమేష్ కీలక పాత్రలో నటించారు. అయితే ఈ సినిమాలో మిత్రవింద పాత్రలో తన నటనతో ఆకట్టుకుంది కాజల్. ఇక ఈ సినిమాతో కాజల్ క్రేజ్ ఒకసారిగా పెరిగిపోవడంతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వచ్చాయి. అయితే నిజానికి ఈ సినిమా కాజల్ చేయాల్సింది కాదట మరొక స్టార్ హీరోయిన్ కోసం ఈ కథను రాసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక హీరోయిన్ ఈ సినిమా నుండి తప్పుకోవడంతో కాజల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అయితే ఈ బ్లాక్ బస్టర్ సినిమాని మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు అనుష్క శెట్టి.


అయితే మగధీర సినిమాలోని మిత్రవిందా పాత్ర కోసం మొదటగా రాజమౌళి అనుష్క అనుకున్నారట. అయితే ఈ పాత్రకి అనుష్క బాగుంటుంది అని జక్కన్న చెప్పాడట. కానీ   ఇద్దరికీ సెట్ అవ్వదు అన్న కోణంలో అనుష్క ఈ సినిమాని రిజెక్ట్ చేసిందట. దాని తర్వాత ఈ సినిమాలో మిత్రవింద పాత్ర కోసం కాజల్ ని ఎంపిక చేశారు జక్కన్న. దీంతో చందమామ కాజల్ ఖాతాలో ఒక బ్లాక్ బస్టర్ హిట్ సినిమా పడింది. ఈ హిట్ సినిమాని మిస్ చేసుకుంది అనుష్క..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: