సెంటిమెంట్ కు ఎదురీత !

Seetha Sailaja
ఫిలిమ్ ఇండస్ట్రిలో సెంటిమెంట్ కీలకంగా  పనిచేస్తుంది. ప్రతి హీరోకి అదేవిధంగా   దర్శకుడికి సినిమా రిలీజ్ డేట్ దగ్గరనుండి సినిమా టైటిల్  హీరోయిన్ ఇలా ప్రతి  విషయంలోను సెంటిమెంట్ ను ఫాలో అవుతూ ఉంటారు. ఇప్పుడు అలాంటి సెంటిమెంట్స్ నుండి చాలామంది హీరోలు దర్శకులు నిర్మాతలు బయటకు వచ్చినట్లు  జరుగుతున్న పరిణామాలు సంకేతాలు ఇస్తున్నాయి.  


 ఇలాంటి సెంటిమెంట్స్ విషయంలో త్రివిక్రమ్ గోపీచంద్ మలినేని  ముందు వరసలో ఉంటారు. త్రివిక్రమ్  ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న ‘గుంటూరు కారం’ సినిమా కోసం మరో ఆలోచన లేకుండా పూజా హెగ్డేను తీసుకున్న విషయం  తెలిసిందే. అయితే  ఇప్పుడు ఈమూవీ నుండి పూజ హెగ్డే తప్పుకుని శ్రీలీల  మెయిన్ హీరోయిన్ గా మారిపోయింది.    


అయితే పూజ స్వచ్చంధంగా తప్పకుందా లేక యూనిట్ ఆమెను తొలిగించిందా  అన్నవిషయమై అనేక రూమర్స్ వచ్చాయి.  త్రివిక్రమ్ తీసిన 2 సినిమాల్లో పూజా హెగ్డే ను హీరోయిన్. దీనితో ఆమె త్రివిక్రమ్ కు గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా మారిన  విషయం తెలిసిందే. ఇక దర్శకుడు గోపీచంద్ మలినేని సెంటిమెంట్ మరీ కీలకం. ఈదర్శకుడికి శృతిహాసన్ అంటే విపరీతమైన సెంటిమెంట్ త్వరలో రవితేజ గోపీచంద్ మలినేని కాంబోలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న ఈమూవీ ప్రాజెక్టు ను మైత్రీ మూవీ మేకర్స్ తీస్తున్నారు.


దీనితో ఈమూవీలో ఖచ్చితంగా శృతిహాసన్ హీరోయిన్ గా ఉంటుందని  అంచనాలు వచ్చాయి కాని జరుగుతున్నది వేరు. గోపీచంద్ మాత్రం ఇప్పుడు వేరే హీరోయిన్ల కోసం ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈవిషయంలో పూజాహెగ్డే పేరు ప్రముఖ్యంగా వినిపిస్తోంది. గతంలో ఈదర్శకుడు శృతిహాసన్ తో ‘బలుపు’ ‘క్రాక్’ ‘వీరసింహారెడ్డి’  సినిమాలు తీసి హాయాట్రిక్ సక్సస్ అందుకున్నాడు. అయితే  ఇప్పుడు ఈసారి మాత్రం గోపీచంద్ శృతి ని రిపీట్ చేయాలని అనుకోకపోవడం   టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది మరి సెంటిమెంట్ కు ఎదురీదుతున్న ఈఇద్దరి దర్శకుల సినిమాల రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: