కల్కి 2898 కి పిట్ట కధల స్పూర్తి !
‘మహానటి’ బయోపిక్ తర్వాత ఇలాంటి విజువల్ గ్రాండియర్ ని దర్శకుడు నాగ్ అశ్విన్ ఎంచుకోవడం సాహసమే అయినప్పటికీ ప్రస్తుతం ఈ టీజర్ కు వస్తున్న స్పందన టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. అయితే భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాకు కొంతకాలం క్రితం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయిన పిట్టకథలుకు లింక్ ఏమైనా ఉందా అన్న ఆశక్తికర చర్చలు ఇప్పుడు జరుగుతున్నాయి.
రెండేళ్ల క్రితం వచ్చిన పిట్టకథలు వెబ్ సిరీస్ ఆశించిన స్థాయిలో ఓటీటీ ప్రేక్షకులకు నచ్చలేదు. ఆ పిట్టకధల వెబ్ సిరీస్ లో నాలుగో ఎపిసోడ్ లో ‘ఎక్స్ లైఫ్’ కు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. అందులో శృతి హాసన్ ప్రధాన పాత్రలో నటించింది. 37 నిమిషాల నిడివితో రూపొందిన ఈ చిన్న షార్ట్ మూవీలో నాగ్ అశ్విన్ భవిష్యత్ లో వర్చువల్ రియాలిటీ సాంకేతికత సగటు మనిషి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకు వచ్చి ముప్పుగా మారుతుంది అన్న విషయాన్ని తీశాడు.
అయితే ఆవిషయం అప్పట్లో ఓటీటీ ప్రేక్షకులకు నచ్చలేదు. ఇప్పుడు ‘కల్కి 2898’ మూవీలో ఎనిమిది వందల సంవత్సరాల తర్వాత ఎలాంటి ప్రమాదాలు వస్తాయి అన్న ఆలోచనతో తీసిన మూవీ. అయితే అదే ఆలోచనకు 6 వందల కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాను తీస్తున్నాడు కాబట్టి ఆపాయింట్ ఇప్పుడు ప్రేక్షకులకు అర్ధం అయ్యే ఆస్కారం కనిపిస్తోంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఏది ఏమైనా ఆనాటి నాగ్ అశ్విన్ తీసిన అలనాటి ఎక్స్ లైఫ్ ఇప్పుడు ‘కల్కి’ గా మారుతుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి..