ప్రస్తుతం టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన బేబీ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమాలో లవర్స్ మధ్య సరికొత్త కోణం డైరెక్టర్ సాయి రాజేష్ చూపించడంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయని అందుకుంది. ఈ లవ్ స్టోరీ కామన్ అయినప్పటికీ కొన్ని సన్నివేశాలు మనసును హత్తుకునే లాగా ఉంటాయి. అలాంటి ఈ సినిమా హీరోయిన్ వైష్ణవి చైతన్య కి మొదటి సినిమా ఫస్ట్ సినిమాలోని వైష్ణవి చైతన్య ఇంత బోల్డ్ గా నటించడంతో ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ చూసి అందరూ షాక్ అవుతారు. ఎందుకంటే మొదటి సినిమాలోని
ఇలాంటి బోల్డ్ సన్నివేశాలు నటిస్తే పెద్దపెద్ద సినిమాల్లో అవకాశాలు రావని చాలామంది హీరోయిన్స్ మొదటి సినిమాలోని ఇలాంటి పాత్ర చేయడానికి ఒప్పుకోరు. అయితే ముందుగా ఈ విషయాన్ని గమనించిన వైష్ణవి చైతన్య నేను ఈ సినిమాలో అలాంటి పాత్రలో నటించను అని చెప్పింది. కానీ డైరెక్టర్ సాయి రాజేష్ మాత్రం ఈ పాత్రకి నువ్వు ఒక్కదానివే న్యాయం చేయగలవు అని ఇందులో నువ్వు అయితే నేను చాలా బాగా సెట్ అవుతావని ఎలాగో అలా ఒప్పించారట డైరెక్టర్. కానీ వైష్ణవి చైతన్య మాత్రం ఇలాంటి సినిమాలు చేస్తే నాకు మళ్ళీ సినిమాల్లో అవకాశాలు వస్తాయా
అని డైరెక్టర్ ఇక డైరెక్టర్ మాత్రం వైష్ణవి చైతన్యని ఒప్పించి ఒక వేళ నీకు ఈ సినిమాలో నటించిన తర్వాత అవకాశాలు రాకపోతే కచ్చితంగా నా రాబోయే మూడు సినిమాల్లో కూడా నువ్వే హీరోయిన్ అని అగ్రిమెంట్ మీద సంతకం చేయించుకున్నాడు. అలా ఈ సినిమాలో వైష్ణవి చైతన్యని హీరోయిన్గా ఫిక్స్ చేశారట డైరెక్టర్. అయితే ఆ అగ్రిమెంట్ ని నమ్మి వైష్ణవి చైతన్య ఈ సినిమాలో బోల్డ్ క్యారెక్టర్ నటించడానికి ఒప్పుకుంది అన్న సమాచారం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది ఇక బేబీ సినిమా విడుదలై వైష్ణవి చైతన్యకి ఎంత మంచి గుర్తింపు వచ్చిందో మనందరికీ తెలిసిందే..!!!